Breaking News

పీఎం విశ్వ‌క‌ర్మ యోజ‌న‌పై క్షేత్ర‌స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాలి

– గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునేలా చూడాలి
– 42 పారిశ్రామిక యూనిట్ల‌కు రూ. 69.93 ల‌క్ష‌ల మేర ప్రోత్సాహ‌కాల‌కు ఆమోదం
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంప్ర‌దాయ చేతివృత్తిదారులు, హ‌స్త‌క‌ళాకారుల‌కు శిక్ష‌ణ‌, నైపుణ్యం, ఆర్థిక స‌హ‌కారం అందించి వారి జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రిచేందుకు వీలుక‌ల్పించే పీఎం విశ్వ‌క‌ర్మ యోజ‌న‌పై పెద్దఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించి.. ప‌థ‌కాన్ని వినియోగించుకునేందుకు అర్హులు ద‌ర‌ఖాస్తు చేసుకునేలా చూడాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్‌గా క‌లెక్ట‌ర్ డిల్లీరావు అధ్య‌క్ష‌త‌న జిల్లా ప‌రిశ్ర‌మ‌లు, ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క క‌మిటీ (డీఐఈపీసీ) స‌మావేశం జ‌రిగింది. తొలుత 2023, ఆగ‌స్టు 31న జ‌రిగిన స‌మావేశంలో క‌మిటీ తీసుకున్న నిర్ణ‌యాల అమ‌లు కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించారు. అనంత‌రం పారిశ్రామిక అనుమ‌తుల‌కు సంబంధించి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు, ప్రోత్సాహ‌కాల మంజూరు, పీఎంఈజీపీ త‌దిత‌రాల‌పై క‌మిటీ చ‌ర్చించింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో 18 కేట‌గిరీల‌కు చెందిన అర్హులైన వారు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు/మీ సేవా కేంద్రాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునేలా ప్రోత్స‌హించాల‌న్నారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015-20), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2020-23), వైఎస్ఆర్ జ‌గ‌న‌న్న బ‌డుగు వికాసం కింద 2023, జులై 7న జ‌రిగిన ప‌రిశీల‌న క‌మిటీ స‌మావేశం ఆధారంగా 42 యూనిట్ల‌కు రూ. 69.93 ల‌క్ష‌ల మేర ప్రోత్సాహ‌కాల‌కు క‌మిటీ ఆమోదం తెలిపిన‌ట్లు వెల్ల‌డించారు. 2023, ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య కార్య‌క‌లాపాలు ప్రారంభించిన వివిధ ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు ప్రోత్సాహ‌కాలు పొందేందుకు 2024, జ‌న‌వ‌రి 23లోగా ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. పారిశ్రామిక అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను స‌ర‌ళీకృతం చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చిన ఏపీ సింగిల్ డెస్క్ విధానం కింద ఈ ఏడాది ఆగ‌స్టు 31 నుంచి డిసెంబ‌ర్ 29 వ‌ర‌కు కాలానికి సంబంధించి వ‌చ్చిన 105 ద‌ర‌ఖాస్తుల‌ను నిర్దిష్ట ఎస్‌ఎల్ఏలోగా ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఆటోన‌గ‌ర్‌లో అగ్నిమాప‌క కేంద్రం ఆధునికీక‌ర‌ణ‌, ఐడీఏ కొండ‌ప‌ల్లిలో అగ్నిమాప‌క కేంద్రం ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు. స‌మావేశంలో జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధి అధికారి ఎ.సుధాక‌ర్‌, ఏపీఐఐసీ జెడ్ఎం కె.సీతారాం, ఎల్‌డీఎం కె.ప్రియాంక‌, పీసీబీ ఈఈ శ్రీనివాస‌రావు, వివిధ శాఖ‌లకు చెందిన క‌మిటీ స‌భ్యులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *