Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా లబ్ధిదారులకు అందించేందుకు సచివాలయ వాలంటరీ వ్యవస్థను ప్రవేశ పెట్టాం

-సచివాలయ ఉద్యోగులు బాధ్యత కలిగి పారదర్శకంగా విధులు చేపట్టాలి
-దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు సరళీకృత ఆర్థిక విధానాన్ని అమలు చేశారు
-పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు.
-సచివాలయ వ్యవస్థ సిఎం మానస పుత్రిక
– మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పారదర్శకంగా వారి ప్రాంతాల్లోనే అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.

మంగళవారం ధవళేశ్వరం జక్కంపూడి సీతారత్నం మెమోరియల్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను, ఏ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా వారి గ్రామములోనే అందించే విధంగా సచివాలయ వ్యవస్థలు సాధించడం జరిగిందని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అందించిన పథకాలను సకాలంలో లబ్ధిదారులకు చేరే విధంగా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థు లందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల వారి పిల్లలను విద్యావంతులను చేసి చూపించారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో రెండు అడుగులు ముందుకేసి నాడు నేడు ద్వారా పాఠశాల ఆధునీకరణ, అభివృద్ధి , మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. పేద పిల్లల చదువులు విద్యార్థి దశలోనే ఆగిపోకుండా అమ్మ ఒడి, విద్యా కానుక, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవన వంటి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థను పటిష్టవంతం చేశారన్నారు. 2014లో నేటి ప్రతిపక్ష నేత ఇంటికో ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసి అది అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఐటీ రంగాన్ని నేనే తెచ్చానని, అభివృద్ధి నా వల్లే జరిగిందని గొప్పలు చెప్పుకుంటాడు తప్ప పేదవారికి చేసింది ఏమీ లేదని అన్నారు. చరిత్ర ఏం చెప్తుంది అంటే 1992 సంవత్సరంలో భారత ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నప్పుడు దేశం ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయములో బంగారం తాకట్టు పెట్టడమే కాకుండా, దేశ అభివృద్ధి కొరకు సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశ పెట్టడంతో విదేశీ పెట్టుబడులు దేశంలో పెరిగి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే మంచి మనసున్న ప్రతి వారు దైవంతో సమానమేనని మంత్రి అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ గా నియమించడం జరిగిందని నా బాధ్యతలను శక్తివంతం లేకుండా పారదర్శకంగా బాధ్యతా యుతముగా నెరవేరుస్తానని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రతి పథకం యొక్క ప్రయోజనాలను లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంతోనే సచివాలయ, వాలంటరీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాల యొక్క ప్రయోజనాలను ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నామన్నారు. అమ్మ ఒడి, ఆసరా,చేయూత, చేదోడు, ఫీజు రియంబర్స్మెంట్, పెన్షన్ తో పాటు నవరత్నాల్లోని అన్ని పథకాలను అర్హులను లబ్ధిదారులందరికి అందజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండలం ఎంపీడీవో డి .శ్రీనివాసరావు, కడియం ఎంపీడీవో కె. రత్నకుమారి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లోని నియోజకవర్గంలోని సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *