Breaking News

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి ఆయా డిపార్ట్మెంట్ అధికారులకు స్పష్టం చేశారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో అదనపు కమిషనర్, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు, విద్యా శాఖ అధికారులతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలన్నారు. నగరంలోని ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నాయని, వాటిలో పోలింగ్ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు పై విద్యా శాఖ, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో వృద్దులకు, వికలాంగులకు వీలుగా ర్యాంప్ లు, టాయ్ లెట్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతుల ఏర్పాటుపై ఎస్.ఈ.తో కలిసి ఏఈఆర్ఓ, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్లు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివజ్యోతి, ఎస్ఈ (ఎఫ్ఏసి) సుందర్రామిరెడ్డి, ఈఈలు కొండారెడ్డి, శ్రీనివాస్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మీ, ఎంఈఓలు నాగేంద్రమ్మ, జ్యోతి కిరణ్, డిప్యూటీ తహసిల్దార్లు బి.భాస్కర్, మల్లేశ్వరరావు, డి.ఈ.ఈలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *