Breaking News

మెరుగైన ఆరోగ్యం పేద,మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో  జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

పెదపారుపూడి , నేటి పత్రిక ప్రజావార్త :
జబ్బు అనేది క్రమం తప్పకుండా వైద్యం చేయించుకొంటేనే నయమవుతుందని, మెరుగైన ఆరోగ్యం అనేది పేద,మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోనికి ప్రభుత్వం తీసుకొచ్చిందని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. సోమవారం పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం పెదపారుపూడి గ్రామంలో 1 కోటి 82 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,67. 54 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలసి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరోగ్యం అనేది పేదలకు ఎంతో అవసరమని, కాయకష్టం చేసుకునేవారు ఒకవేళ అనారోగ్యం పాలైతే వారి కష్టార్జితం అంతా వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఆరోగ్య సంరక్షణ అనేది ప్రజలకు భారం ఎన్నటికీ కాకూడదని ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పి ప్రజల చెంతకు వైద్యం తీసుకురావాలన్న దృక్పథంతో పని చేస్తోందన్నారు. అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్‌–2 కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి ప్రారంభమైందని ప్రతీవారం గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో.. పట్టణ ప్రాంతాల్లో ప్రతీవారం ఒక వార్డు పరిధిలో సురక్ష శిబిరాలు జిల్లాలో కొనసాగుతున్నాయన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా విలేజ్‌ క్లినిక్‌లకు మందులు చేరవేసి అక్కడి నుంచి ఏఎన్‌ఎంల ద్వారా సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు నేరుగా ఇంటివద్దనే డబ్యుహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలుగల మందులు ఉచితంగా అందించడం గమనార్హమని, ఈ మందులు అయిపోయిన తరువాత వాటి కో­సం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేకుండా విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌తో అనుసంధానం చేసి డోర్‌ డెలివరీ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నారని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. పెదపారుపూడి గ్రామ సచివాలయం ఏర్పాటు ద్వారా మీ గ్రామంలోనే 10 మంది ఉద్యోగులు మీకు అందుబాటులో ఉండి వివిధ సేవలందిస్తారని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు, గ్రామ సచివాలయంలో అన్ని శాఖలు ఉంటాయని. ఏదైనా సమస్య వస్తే పెదపారుపూడి గ్రామంలోని పరిష్కారం దొరుకుతుందన్నారు. ఏదైనా సర్వే రిజిస్ట్రేషన్ స్థానికంగానే జరుగుతుందన్నారు అనంతరం, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన, ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతమైన పెదపారుపూడి గ్రామంలో ఒక కోటి 82 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కార్పొరేటు స్థాయిలో అందించే వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు సైతం విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసి మెరుగైన ప్రభుత్వ వైద్యాన్ని పేదల ముంగిట వద్దకే అందించడం జరుగుతుందని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం డాక్టర్లు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుందని చెప్పారు. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ మరెవరు కూడా చూడలేదని ఎమ్మెల్యే ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపారుపూడి గ్రామ సర్పంచ్ చప్పిడి సమీరా, గుడివాడ ఆర్డిఓ పి. పద్మావతి, డిఎంహెచ్వో డాక్టర్ జి. గీతా బాయ్, ఎంపీడీవో టీ. సీతామహాలక్ష్మి, తహసిల్దార్ వి. నాగభూషణం పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *