మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన పెండింగ్ అర్జీలు గడువులోగా పరిష్కరించాలని, అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై స్పందన నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వివిధ శాఖల స్పందన పెండింగ్ అర్జీలపై సమీక్షించారు. స్పందన సమావేశం ప్రారంభంలో జాయింట్ కలెక్టర్ అధికారుల హాజరు పరిశీలించి, కొంతమంది జిల్లా అధికారులు హాజరు కాకపోవడం గమనించి ఉదయం పదిన్నర గంటలకల్ల స్పందనకు హాజరుకావాలని జిల్లా అధికారులకు సూచించారు. తగిన అనుమతితో, సహేతుక కారణాలతో జిల్లా అధికారులు హాజరుకానిపక్షంలో స్పందన అర్జీలు పరిష్కారం పై, శాఖపరమైన అంశాలపై అవగాహన కలిగిన తదుపరి స్థాయి అధికారులను పంపాలని అన్నారు. స్పందన అర్జీలలో… కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామానికి చెందిన చలసాని జోగేంద్రనాథ్ కోలవెన్ను గ్రామ పరిధిలో కొన్ని సర్వే నంబర్లు వక్ఫ్ భూములుగా పొరపాటున నమోదయ్యాయని వాటిని 22 ఏ నుండి తొలగించవలసిందిగా కోరుతూ అర్జీ సమర్పించారు గుడివాడకు చెందిన కొలుసు ప్రసాద్ తన తాత ద్వారా సంక్రమించిన భూమిని తన పేరున అడంగల్ లో నమోదు చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. డిఆర్ఓ పెద్ది రోజా, ఆర్డీవో ఎం వాణి, జడ్పీ సీఈవో జ్యోతి బసు , డీఎస్ఓ పార్వతి, డీఈవో సాహెరా సుల్తానా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News