Breaking News

బాలికలలో దృఢ సంకల్పం ధైర్యాన్ని నింపుదాం.

-ఆకాశమీ హద్దుగా బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి.
-ఉన్నత స్థితికి చేరేలా బాలికలకు అండగా ఉందాం.
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లింగ వివక్షతను రూపుమాపి బాలికలు దృఢ సంకల్పం, ధైర్యంతో ఆకాశమే హద్దుగా ఉన్నత స్థాయిని చేరుకునేలా ప్రతిఒక్కరు అండగా నిలవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లో బుధవారం బిషప్ అజరయ్య పాటశాలలో నిర్వహించిన బాలిక దినోత్సవం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాలికలలో దృఢ సంకల్పాన్ని ధైర్యాన్ని నింపి స్వతంత్రంగా ఉన్నత స్థితికి చేరుకునేలా ప్రోత్సహించటంలో తల్లిదండ్రులు స్వచ్చంద సంస్థలు అధికారుల పాత్ర కీలకమన్నారు. బాలికలు కన్న కలలు నిజం చేసుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు తోడుగా నిలవాలన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని రంగాలలో ముందుండేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను బాలికలు అందిపుచ్చుకొనేందుకు కృషి చేద్దామన్నారు. సమాజంలో అక్కడక్కడ ఉన్న పక్షపాత భావజాలాన్ని ఎదుర్కొనే శక్తియుక్తులను బాలికలకు అందించేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబ వ్యవస్థ గురించి చిన్ననాటి నుండే బాలికలకు తెలియచెప్పి పాచ్యాత్య ధోరణులకు దూరంగా ఉండేలా తల్లిదండ్రలు శ్రద్ద పెట్టాలన్నారు. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పించేల పాఠశాలలు కళాశాలల్లో ప్రత్యేకంగా అవగాహన సదస్సులను నిర్వహించి చైతన్యవంతులను చేయాలన్నారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలలో సమాన అవకాశాల కోసం మాత్రమే కాకుండా బాలికలకు వారి హక్కుల గురించి అవగాహనను పెంపొందించడం, బాల్య వివాహాలు, వివక్ష, బాలికలపై హింస వంటి సమస్యలపై పరిష్కరించేందుకు కృషి చేస్తామని అందరం ప్రతిజ్ఞ పూనాలన్నారు. బాలికలపై వివక్షతను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని బాలురు, బాలికలు ఇద్దరు సమానమేనన్నా సంకేతాన్ని బలంగా వినిపించేలా చర్యలు తీసుకొంటుందన్నారు. బాల్య వివాహాలు, పోషకాహార లోపం నివారణ లింగ ఆధారిత హింస నుండి బాలికలను రక్షించడం వంటి అంశాలలో ప్రభుత్వం కల్పించిన చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పురుషులతో సమానంగా బాలికలకు కల్పిస్తున్న అవకాశాల వలన బాలికల విద్య శాతం పెరిగి బాల్య వివాహలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. ఆశయాలను సాధించడానికి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనే విషయంలో బాలికలు ముందుంటున్నారు. బాలికలు అనేక శారీరక సవాళ్లను ఎదుర్కొంటున్నారని యుక్తవయస్సు వచ్చిన తర్వాత శారీరక మార్పులకు లోనవుతారని, పోషకాహార లోపంతో బాధపడే మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయన్నారు. బాలికలలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు వైద్య పరీక్షలను నిర్వహించి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. బాలికల పట్ల అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించటంలో స్వచ్చంద సంస్థలు మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కోరారు. మార్పు ట్రస్ట్ సహకారంతో విద్య, సాంస్కృతిక, క్రీడా రంగాలలో ప్రతిభకనపరచిన బాలికలకు జిల్లా కలెక్టర్ జ్ఞాపికలను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారిణి జి. ఉమాదేవి, గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, బిషప్ అజరయ్య కళాశాల ప్రిన్సిపల్ సంధ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయిని జయశ్రీ, సీఆర్ఎఎఫ్ ప్రోగ్రాం డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబీ, సి డబ్ల్యు సి చైర్ పర్సన్ సువార్త, మానసిక వైద్యురాలు డా. కృష్ణకుమారి, మార్పు ట్రస్ట్ ప్రతినిధి సాధిక్, సీడీపీవోలు జి. మంగమ్మ, కె. నాగమణి, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *