తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతీ యువకులకు టూరిజం అండ్ హాస్పిటలిటీ సెక్టార్ నందు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ(APSSDC) ఆధ్వర్యంలో తిరుపతి లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మ్యానేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ (SIHMCT & AN) నందు హౌస్ కీపింగ్ ట్రైనీ మరియు ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీస్ అసిస్టెంట్ కోర్సులకు సంబంధించి ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడును.
1) హౌస్ కీపింగ్ ట్రైనీ (3 months)
2) ఫుడ్ & బేవరేజ్ సర్వీస్ అసిస్టెంట్ (3 months)
అర్హత: 10th /SSC పాస్
వయస్సు: 18 – 28 సం//లు
ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు “స్కిల్ ఇండియా సర్టిఫికెట్” మరియు ప్రముఖ హోటల్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించబడును.
కావున ఈ నిరుద్యోగ యువతీ యువకులు 05-02-2024 వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోని ఈ సదావకాశాన్ని వినియోగించుకుని తద్వారా ఉపాధి పొందాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లా అధికారి ఆర్ లోకనాథం గారు ఒక ప్రకటనలో తెలియజేశారు, మరిన్ని వివరాలకు 8143576866, 9100558006, 9966601867 ను సంప్రదించగలరు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
రిజిస్ట్రేషన్ లింక్: https://forms.gle/X7nX9YKpVEhoYX6y6
Prajavartha Online Telugu News