Breaking News

సమగ్రాభివృద్దే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నగర సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారని నగర మేయర్ కావటి శివనాగమనోహర్ నాయుడు అన్నారు. మణిపురం వంతెన నుండి జాతీయరహదారి వై జంక్షన్ వరకు షుమారు 3.5 కిలోమీటర్ల బిటి రోడ్ ని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) నిధుల నుండి రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులను ఆదివారం మంగళదాస్ నగర్ వద్ద కమిషనర్ కీర్తి చేకూరి, ఎంఎల్ఏ మహ్మద్ ముస్తఫాలతో కలిసి మేయర్ శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా గుంటూరు నగరంలో పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా సమగ్రాభివృద్దే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు. గత అనేక ఏళ్ల నుండి గోతుల రోడ్ వలన విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం నూతన బిటి రోడ్ ను 15 రోజుల గడువులోగా పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని తెలిపారు. గుంటూరు నగరం ఇప్పటికె జాతీయ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది స్వచ్చ వాయు సర్వేక్షణ్, స్వచ్చ సర్వేక్షణ్ లో అత్యుత్తమ స్థానాలు సాధించిందని, నగరంలోని 57 డివిజన్లలో ఒక్కో డివిజన్ కు షుమారు రూ.12 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని మరింతగా అభివృద్ధి పదంలో నిలిచేలా కృషి చేస్తామని తెలిపారు.
ఎంఎల్ఏ మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి భాధ్యతలు తీసుకున్న నాటి నుండి గుంటూరు నగర అభివృద్ధి పై ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారన్నారు. వార్డ్ ల వారీగా ఏళ్ల తరబడి గత పాలకులు నిర్లక్ష్యం చేసిన మౌలిక వసతులను ప్రస్తుతం ప్రభుత్వంలోనే చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్, మేయర్ ల దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే స్పందిస్తున్నారన్నారు. అభివృద్ధి పనులను అధికారులు దగ్గర ఉండి వేగంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు.
కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ కేంద్ర నిధులైన ఎన్.క్యాప్ నుండి జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ ఆమోదంతో నగరంలో సుధీర్ఘ కాలంగా నుండి పెండింగ్ లో ఉన్నప్రధాన రహదార్ల పునరుద్ధరణ చేపట్టామన్నారు. నగర ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ప్రధాన రహదార్లలో గుంతల వలన ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు శాశ్వత పరిష్కారం, నగరంలో వాతరావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎండ్ టు ఎండ్ రోడ్ ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రూ.12 కోట్ల ఎన్.క్యాప్ నిధులతో నగరంలో ప్రదానమైన జెకెసి కాలేజి రోడ్, పెద్ద పలకలూరు రోడ్ లకు గత ఏడాది పనులు చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం పెద్ద కాకాని రోడ్, పొన్నూరు రోడ్, నందివెలుగు రోడ్, చుట్టగుంట జంక్షన్, ఎత్తు రోడ్ జంక్షన్, బ్రాడిపేట4 వ లైన్, రెడ్డి పాలెం మెయిన్ రోడ్ నుండి ఆదిత్య నగర్ 1 వ లైన్ వరకు నూతన రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను ఎస్.ఈ., ఈ.ఈ.లు నేరుగా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఎస్ఈ(ఎఫ్ఏసి) సుందర్రామిరెడ్డి, ఈఈ కోటేశ్వరరావు, నూరి ఫాతిమా, డిఈఈ శ్రీధర్, ఏఈ సునీల్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు మర్రి అంజలి, రిహానా పఠాన్, కె.రంగారెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *