Breaking News

జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

-మార్చి 18 నుంచి 30 వరకు పదవ తరగతి పరీక్షల నిర్వహణ
-జిల్లాలో 30921 మంది విద్యార్థులు,162 పరీక్ష కేంద్రాలు
-ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటు
-సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా : జిల్లా జాయింట్ కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2024-మార్చి 18 వ తేది నుంచి 30 వ తేది వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా, నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు సంబoదిత శాఖల సిబ్బందితో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. 2024 సంవత్సరపు పదవతరగతి పరీక్షలను ఎంతో జాగ్రత్తగా ఉండి పగడ్బందీగా పరీక్షలు నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 162 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలని , ఏమైనా లోటుపాట్లు ఉంటే ముందుగానే చక్కదిద్దాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద త్రాగునీటి వసతి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బీపీ, షుగర్ చెక్ చేసే పరికరాలు, అత్యవసర మందులతో వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఒకరు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు. మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేసి ప్రతిరోజూ కేంద్రాలను తనిఖీ చేస్తాయన్నారు. అలాగే సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణ మార్చి 18 వ తేది నుంచి 27 వ తేది వరకు, ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణ మార్చి 1వ తేది నుంచి 19 వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాలో పదవ తరగతి విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ.. జిల్లాలో పదవ తరగతి మార్చి 2024 పరీక్షలకు సంబంధించి మొత్తం 30921 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలో 162 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులను 8.45కు కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో డిప్యూటీ ఈ ఓ, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డి పి ఓ రాజశేఖర్ రెడ్డి, ఆర్ ఐ ఓ ప్రభాకర్ రెడ్డి, తిరుచానూరు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *