Breaking News

ఓటర్ల సవరణకు సంబదించిన 6,7,8 ఫారంలు తొందరగా పూర్తి చేయాలి.

-ఈ – ఓటరు గుర్తింపు కార్డు జనరేట్, ప్రింటింగ్, డెలివరీ కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయండి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ 

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల సవరణకు సంబదించిన 6,7,8 ఫారం డిస్పోజ్ ప్రక్రియ త్వరిత గతిన పూర్తి కావాలి అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర సంబంధిత ఈఆర్వో లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఓటర్ల సవరణకు సంబదించిన ఫారం 6,7,8 డిస్పోజ్ పక్రియ త్వరితగతిన పూర్తి కావాలన్నారు . ప్రతి ఫారం కూడా క్లుప్తంగా పరిశీలించి ఏ పొరబాట్లు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల సన్నద్ధతపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అవసరం మేరకు ఆర్వోలు, ఏఈఆర్వోలు,నోడల్ ఆఫీసర్ల కొరత లేకుండా జిల్లా ఎన్నికల అధికారులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరిస్తూ.. జిల్లాలో ఓటర్ల సవరణకు సంబంధించిన 6,7,8, ఫారం లు పెండింగ్ లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో, ఎన్నికలు సజావుగా జరిగేలా పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అవగాహన కలిగేలా జిల్లాలో మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ జరుగుతుందని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై. రానున్న సార్వత్రిక ఎన్నికలు- 2024 నిర్వహణ లో భాగంగా సమావేశమై.. జిల్లాలో ఓటర్ల సవరణకు సంబంధించిన 6,7,8 ఫారం పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. త్వరితగతిన ఈ – ఓటరు గుర్తింపు కార్డు జనరేట్, ప్రింటింగ్, డెలివరీ సంబంధించిన పూర్తి పక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఆర్వోలు, ఏ ఆర్ ఓ లు కు మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 13 వ తేది నుంచి మార్చి1వతేది వరకు జరగనున్నదని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంకు సంబంధించిన పూర్తి బాధ్యతగా నోడల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు ఉండేలా చూడాలని ర్యాంపు ఏర్పాటు, తగినంత మరుగుదొడ్లు, త్రాగు నీటి ఏర్పాటు, నెట్వర్క్ సంబంధిత కనెక్టివిటీ సక్రమంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఈవీఎం నోడల్ అధికారి కోదండ రామిరెడ్డి, ఆర్వోలు నిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *