Breaking News

చిన వెంకన్న సేవలో రాష్ట్ర మంత్రులు

ద్వారకాతిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని డిప్యుటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణ, రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనితలు బుధవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వారికి శ్రీవారి శేషవస్త్రాలను కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆ తర్వాత ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు చినవెంకన్న జ్ఞాపికలను, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ట్రస్టుబోర్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *