-విజయ వంతంగా నిర్వహించిన వైద్య బృందం
-ఆరోగ్యశ్రీ కింద ఏరియా ఆసుపత్రికి రూ.5 లక్షల పరికరాలకు అందచేసిన కలక్టర్ మాధవీలత
-వైద్యులను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అనపర్తి ఏరియా ఆసుపత్రి నందు అనపర్తి గ్రామానికి చెందిన శ్రీధర్ అనే పేషెంట్ కు తుంటి మార్పిడి సర్జరీ ని డాక్టర్ ప్రదీప్i సుందర్ ఎముకల వైద్య నిపుణులు, మత్తు వైద్య నిపుణురాలు డా. రజనీ వారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని డి సిహెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి సోమవారము ఒక ప్రకటనలో తెలియ చేశారు.
రెండూ రోజుల క్రితం విజయవంతంగా ఆపెరేషన్ చేసినట్లు తెలిపారు. నేడు శ్రీధర్ పూర్తి ఆరోగ్యం తో కోలుకోవడం జరిగిందనీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల రూపాయలను మంజూరు చేసి, సంబంధించిన వైద్య పరికరాలను సమకూర్చడం జరిగిందనీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాల ని అందించడం వల్ల నేడు ఈ శస్త్ర చికిత్స విజయ వంతంగా నిర్వహించినట్లు తెలియ చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సర్జరీ నిర్వహించిన వైద్య నిపుణుల బృందాన్ని అభినందించి సన్మానించడం జరిగినది. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ఇదే ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకుంటే 2 నుండి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కానీ మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తిగా ఉచితంగా చేయడం జరిగిందని తెలియజేశారు. జగనన్న ప్రభుత్వం లో ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ భరోసాగా నిలుస్తున్నారని అనడానికి ఇటువంటి ఘటనలు నిదర్శనం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. రామ గుర్రెడ్డి, డాక్టర్ తరుణ్, డా వర్మ, డా. సునీత, డా. సునీల్ రాజ్, డా. డేవిడ్, డా వాణి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బాల, ఉమా శంకర్, గుంటూరు శ్రీను, చింతా శ్రీను, ఏడుకొండలు (MPTC ), తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News