విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ది. 13.03.2024 వ తేదీన సాయంత్రం 04.00 గంటలకు కేంద్ర పథకములైన NSFDC / NSKFDC / NBCFDC / NAMASTE పథకముల క్రింద లబ్ధి పొందిన మరియు లబ్ధి పొందుచున్న లబ్ధిదారులతో దేశవ్యాప్తంగా 525 జిల్లాల్లో “ప్రధానమంత్రి సు-రాజ్” అని పేరున Outreach Programme (లబ్దిదారులను చేరువ చేయు కార్యక్రమము) నిర్వహించబడుచున్నది. ఈ కార్యక్రమమునకు గౌరవ ప్రధానమంత్రి వర్యులు వర్చువల్ విధానము ద్వారా (మౌఖికముగా) పాల్గొనుచున్నారు. వారు ఎంపిక కాబడిన లబ్ధిదారులతో ముఖాముఖిగా సంభాషించనున్నారు. ఈ కార్యక్రమము రాష్ట్రంలోని అన్ని జిల్లాల యందు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నది. జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు ను ఈ కార్యక్రమమనకు జిల్లాస్థాయి నోడల్ అధికారిగా నియమించుట జరిగినది. వీరు జిల్లా నందలి బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు మరియు జిల్లా నందలి అందరు మున్సిపల్ కమిషనర్ల సమన్వయముతో ఈ కార్యక్రమమును నిర్వహించెదరు.
ఈ కార్యక్రమము జిల్లా లోని ప్రజా ప్రతినిధులను మరియు ఇతర అధికారులను ఆహ్వానించి పకడ్బందీగా నిర్వహించుటకు అందరు జిల్లా కలెక్టర్లు మరియు జిల్లాస్థాయి నోడల్ అధికారులకు మరియు రాష్ట్రస్థాయి సంబంధిత అధికారులకు తగు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ను మరియు ఇతర సూచనలను జారీ చేయుట జరిగినది. ఈ కార్యక్రమము సమగ్రముగా నిర్వహించుటకు అవసరమగు లబ్ధిదారుల హాజరు, ఎల్ఈడీ స్క్రీన్లు, జనరేటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు మొదలగు ఇతర సదుపాయములు సమకూర్చుకొని విజయవంతముగా ఈ కార్యక్రమము నిర్వహించవలసినదిగా కోరడమైనది.
ఈ కార్యక్రమంలో నమస్తే పధకము క్రింద ఎంపిక కాబడిన సఫాయి కర్మఛారీలకు వ్యక్తిగత భద్రత కిట్లను (PPE కిట్లను) మరియు ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేయబడును. ఈ కార్యక్రమమును వ్యక్తిగతముగా పర్యవేక్షించుటకు కేంద్ర మంత్రిత్వ శాఖ నలుగురు అధికారులను (ప్రతి నాలుగు జిల్లాలకు ఒకరు చొప్పున) పరిశీలకులుగా నియమించడం జరిగినది. వారు జిల్లా కలెక్టర్, నోడల్ అధికారులు మరియు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమమును విజయవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేయుదురు. కావున అందరు జిల్లా కలెక్టర్లు, అందరు మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ కార్పొరేషన్ మరియు బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఈ కార్యక్రమమును సమన్వయంతో పని చేసి కార్యక్రమమును విజయవంతంగా నిర్వహించవలసిందిగా కోరడమైనది.
Tags vijayawada
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News