-ధార్మిక సంస్థల గొప్పతనాన్ని నేటి తరానికి తెలియ చేయాలి – ఎమ్మెల్యే కొడాలి నాని
-మహానుభావులు నెలకొల్పిన సంస్థల సేవలు పదిమందికి చేరువ చేయాలి…..
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ దేవరకొండ నాగన్న గారి బ్రాహ్మణ అన్నదాన సత్రం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం సత్రం ప్రాంగణంలో మంగళవారం ఘనంగా జరిగింది. ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్గా నండూరి ఉమాశంకర్ ఇతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఎంతో మంచి ఆశయంతో నాటుతరం రోజుల్లో వివిధ రూపాల్లో ధార్మిక సంస్థలను ఎందరో మహానుభావులు నెలకొల్పారన్నారు. దశాబ్దాలు గడిచిన మహనీయులు నెలకొల్పిన సంస్థల సేవలు నేటికీ మనకు అందుతున్నాయని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. నేడు బాధ్యతలు చేపట్టిన నాగన్న సత్రం కమిటీ సభ్యులు, బాధ్యతతో పనిచేస్తూ సత్రం అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే కొడాలి నాని సూచించారు. అనంతరం కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నండూరి ఉమాశంకర్, ధర్మకర్తల కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన కామరాజు భవన్నారాయణ శాస్త్రి, ముదునూరి చంద్రశేఖర్, తమ్మిశెట్టి రమ్య, బడుగు నాగమణి, పొదిలి దుర్గాభవాని, కూరపాటి భవానీలను ఎమ్మెల్యే కొడాలి నాని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్,గుడివాడ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను,జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళి,జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు,వైసిపి నాయకులు పాలేటి చంటి, చంద్రాల హరి రాంబాబు,ఘంటా చంద్ర శేఖర్,దుడ్డు చిన్నా,తోట శివాజీ,ఘంటా శ్రీను,డాక్టర్ ఆర్కే,గంట సురేష్, జోగా సూర్యప్రకాష్, రేమల్లి నీలాకాంత్ ముడెడ్ల ఉమా, జొగ నాగేశ్వరరావు, కోంకితల అంజనేయ ప్రసాద్, సింగిరెడ్డి గగారిన్, కలపాల కిరణ్, ఈవో కానూరు సురేష్ బాబు, పెద్ద సంఖ్యలో భక్తులు, పలువురు పట్టణ ప్రముఖులు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News