Breaking News

ఏప్రిల్ 2న “ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రెటరీ” కార్యక్రమం

-జిల్లా నుండి పాఠశాల స్థాయి వరకు బోధనా, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని సూచన
-పాఠశాలల్లోని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీల ద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వెల్లడి
-పాఠశాలల్లో ఐఎఫ్ ఫీలు, స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్ పనితీరును నిర్ధారించేందుకు ఉపకరించనున్న కార్యక్రమం..
-1-9 తరగతులకు తుది పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్ 23 న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం.. విద్యార్థులకు రిపోర్ట్ కార్డుల పంపిణీ..
-పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల్లో ప్రతి రోజూ చదువుకునే అలవాటు పెంపొందించడం, విద్యలో వారి సామర్థ్యం, ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలపడం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు, ట్యాబ్ లు, స్మార్ట్ టీవీల వినియోగం, పనితీరు లక్ష్యంగా “ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రెటరీ” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కార్యక్రమం రూపకల్పనలో భాగంగా రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు, డీఈవోలతో ప్రవీణ్ ప్రకాష్ చర్చించి కార్యక్రమ వివరాలు, ఉద్దేశంతో పాటు విలువైన సలహాలు, సూచనలు అందించారు.

అనంతరం ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ 2 ఏప్రిల్, 2024న ఉదయం 11గంటలకు “ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రెటరీ” కార్యక్రమం ఉంటుందని, కొత్త తరహాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పూర్తి సంభాషణాత్మకంగా(ఇంటరాక్టివ్ విధానంలో) ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నుండి పాఠశాల స్థాయి వరకు బోధనా, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీల ద్వారా వివిధ తరగతుల విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ యొక్క అన్ని ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం ప్రశ్నలు అడిగేందుకు వీలుగా ఫోన్ నెంబర్ వెల్లడిస్తామన్నారు. వాట్సాప్ నంబర్ ద్వారా ప్రశ్నలు పంపేందుకు విద్యాశాఖ బోధనా, బోధనేతర సిబ్బందికి అవకాశముంటుందన్నారు. పాఠశాలల్లోని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్ పనితీరును నిర్ధారించేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందన్నారు. ప్రత్యక్షంగా ఆన్ లైన్ లో ఇంటరాక్ట్ అవడం ద్వారా ఎన్ని ఐఎఫ్ ఫీలు, స్మార్ట్ టీవీలు కనెక్ట్ అయ్యాయో తెలుసుకొని సెంట్రల్ కమాండ్ సెంటర్ ద్వారా నివేదికను రూపొందిస్తామన్నారు.

ప్రధానంగా ఏప్రిల్ 6వ తేదీ (శనివారం) నుండి 1 – 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఫైనల్ అసెస్‌మెంట్‌లు (పరీక్షలు) ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్ పూర్తి మరియు విద్యార్థుల నోట్స్‌లను సరిచేయడం వంటి అంశాలు పరిశీలిస్తానని ప్రవీణ్ ప్రకాష్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అంతేగాక విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన పెంచేందుకు యునైటెడ్ స్టేట్స్ లోని ప్రిన్స్ టన్ లో వారం రోజుల పాటు జరిగే కార్యక్రమం కోసం ప్రత్యేకంగా గుర్తించిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల నుండి జిల్లాకు ఇద్దరు చొప్పున టోఫెల్ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా నాడు-నేడు కార్యక్రమం తీరు, నిర్వహణ పరిశీలిస్తామన్నారు. 1 – 9 తరగతుల పరీక్షలు పూర్తికాగానే 23 ఏప్రిల్ న పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి రిపోర్ట్ కార్డులను పంపిణీ చేసి, విద్యాశాఖ ఛానెల్, ఐఎఫ్‌పిలు మరియు స్మార్ట్ టీవీ ల ద్వారా ప్రత్యక్షంగా వారితో సంభాషిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 2 ఏప్రిల్ నుండి 23 ఏప్రిల్ వరకు ఆయా పాఠశాలల్లో సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *