విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ మధ్య.. పరిశుద్ధ శనివారం నాడు విజయవాడలో వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం ఐక్యవేదిక నాయకులు యద్దనపూడి పవన్‌కుమార్, అమృతపూడి కార్తీక్, కాండ్రు సుధాకర్‌లు తెలిపారు. గురువారం వారు ప్రెస్‌క్లబ్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక, ఫెడరేషన్ ఆఫ్ చర్చస్, ఆంధ్రప్రదేశ్ బాప్టిస్ట్ సంఘాల ఐక్యవేదిక, విజయవాడ పాస్టర్ ఫెలోషిప్, ఆల్ డినామినేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ చర్చస్, కథోలిక్ మరియు ప్రొటెస్టంట్ సంఘాలన్నీ సంయుక్త ఆధ్వర్యంలో 30వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఆర్‌సీఎం సెయింట్ పాల్ కేథడ్రల్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. సిద్ధార్థ పాలిక్లినిక్ రోడ్, మదర్ థెరిస్సా సర్కిల్, ఉడ్‌పేట, శిఖామణి సెంటర్, గిరిపురం మీదగా సీఎస్‌ఐ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వినూత్నమైన ఎక్యుమెనికల్ ర్యాలీ ‘రన్ ఫర్ జీసస్’లో అనేక మంది క్రైస్తవ ప్రముఖులు, సంఘ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు పాల్గొంటారన్నారు. ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం ఒక వ్యక్తికో, సంస్థకో, సంఘానికో సంబంధించినదిగా గాక ప్రజలందరికి సంబంధించిన కార్యక్రమం అని అన్నారు. నగరంలోని క్రైస్తవ సోదరులంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిపురపు గ్రిటన్ తదితరులు, విశ్వాసులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News