Breaking News

ఈ నెల 12 న ఈవిఎం ల రాండమైజేషన్ ప్రక్రియ

-గ్రామ, వార్డు స్థాయిలలో ఎలాంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరగరాదు : జాయింట్ కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 12వ తేదీన ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ జరగనున్నదని దీనికి సంబంధించి నియోజకవర్గాలలోని ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ లు పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర ఆదేశించారు. గురువారం ఉదయం ఆర్. ఓ లు, ఏ.ఆర్. ఓ లు, సెక్టోరల్ అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.డీ.ఓ లు, మునిసిపల్ కమిషనర్లతో , క్లెయిమ్ లు, ఎంసి.సి. , S V E E P, పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలపై జాయింట్ కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన ఈవీఎంల రాండమైజేషన్ ప్రక్రియ జరగనున్నదని దీనికి సంబంధించి అన్ని నియోజకవర్గాలలోని ఇంటర్మీడియటరీ స్ట్రాంగ్ రూములు పక్కాగా ఉండాలని అన్నారు. గ్రామ వార్డు స్థాయిలలో ఇంకనూ ఉన్న బ్యానర్లు, పోస్టర్లను ఇతర ఉల్లంఘనలను తొలగించాలని ఎక్కడ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని సంబంధిత బిఎల్వోలు, సెక్టార్ అధికారులు సరి చూసుకోవాలని దీనిని తహశీల్దార్లు పర్యవేక్షించాలని అన్నారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ పెంచల కిషోర్ సంబంధిత ఆర్.ఓ లు, ఏఆర్ఓ లు, తహశీల్దార్లు, ఎం.పి. డి.ఓ లు, మునిసిపల్ కమీషనర్ లు, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *