విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో సంక్షేమం సంక్షోభంగా మారిందని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్య క్షుడు కడియం సూరిబాబు మాట్లాడుతూ జరగబోవు 2024 ఎన్నికలలో అసెంబ్లీ పార్లమెంట్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తొలి జాబితా ప్రకారం ఈ సమావేశంలో మా పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులకు బి ఫారాలు అందజేశామని తెలియజేశారు. మా గుర్తు ‘డ్రిల్లింగ్ మిషన్’ పై ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నామన్నారు. ప్రస్తుతం అనేక పార్టీలు ప్రజల సమస్యల పట్ల ఏమి పట్టించు కోవడంలేదని, ప్రస్తుతం సంక్షేమం, సంక్షోభంగా మారిందని, సంక్షేమాలిచ్చి దేశంలో ప్రజలను సోమరిపోతులుగా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు అనేక ఎన్నికలలో తాయిలాలు ప్రకటించి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కొన్ని పార్టీల వ్యూహకర్తలు ద్వారా వ్యూహాలు రచించి ప్రజలను మభ్యపెడుతున్నారని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, రెండు కళ్ళు లాంటివని అవి సక్రమంగా ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. మా పార్టీ ప్రజలకు ముఖ్య అవసరాలైన విద్య, వైద్యానికే ప్రాముఖ్యత ఇస్తున్నామని, మా మేనిఫెస్టోలో కూడా అవే చెబుతున్నామని తెలిపారు. ఈ కార్య క్రమంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News