Breaking News

సమస్యలను పరిష్కారం చేసిన ఘనత వైసిపి ది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
15వ డివిజన్లో పుట్ట రోడ్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు వైసీపీ నాయకులు.. 15వ డివిజన్లో 31 కోట్ల అభివృద్ధి పనులు చేశామని గతంలో ఏ ప్రభుత్వం ఈ పని చేయలేకపోయిందని తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. సామాన్య ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చటంతో పాటు వారి సమస్యలను పరిష్కారం చేసిన ఘనత వైసిపి ప్రభుత్వంది అని చెప్పారు. రోడ్లు, డ్రైన్లు, స్కూలు ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ, బరియల్ గ్రౌండ్ ఏర్పాటుకు కోటి రూపాయలు కేటాయించి ముందుకు వెళ్లామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గడపగడపకు తిరుగుతూ ఓటర్లు కలిసి ఓట్లు అభ్యర్థించారు. వైసిపి హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ 5 సంవత్సరాల పాలనలో డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఈ డివిజన్ ని దత్తత తీసుకున్న గద్దె రామ్మోహన్ ఏమీ అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 65 కోట్లకు పైగా సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. తాము చేసిన అభివృద్ధి ప్రజలందరికీ కనిపిస్తుంది కానీ గద్దె రామ్మోహన్ కి మాత్రం కనపడటం లేదన్నారు. నిత్యం అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. రిటైనింగ్ వాల్ పై సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అభివృద్ధి చేసిన వాళ్లకి ఓట్లు వేయండి అని ప్రచారం చేస్తున్న గద్దె రామ్మోహన్ ఓట్లు కూడా వైసీపీకే వేయాలని ప్రచారం చేస్తే బాగుంటుందన్నారు. ఎందుకంటే వైసిపి హయాంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు గద్దె రామ్మోహన్ గుదిబండల మారాడని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు వైసిపికి ఓటు వేసి గద్దె రామ్మోహన్ కు బాయ్ బాయ్ చెప్పాలని అవినాష్ కోరారు. ఏ పార్టీ అయితే అభివృద్ధి సంక్షేమం అందించి పేదలకు అండగా నిలిచిందో ఆ పార్టీకి ఓటు వేయాలని అవినాష్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *