-జనసేన పార్టీ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మాజీ జనసేన నాయకుడు పోతిన మహేష్ విమర్శించే స్థాయి కాదు అని *జనసేన పార్టీ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్*హెచ్చరించారు. ఆదివారం స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోతిన మహేష్ విజయవాడ సిటీ లో పార్టీని చంపేశారని ఆరోపించారు. ఆయన పార్టీని అడ్డు పెట్టుకొని అక్రమ వసులు చేశారని ఆయన ఆరోపించారు. అమ్మవారి గుడిలో కాంట్రాక్టర్లను విసిగించి వారి దగ్గర నుంచి మామూలు దండుకోవటం ఆయనకు. అలవాటని ఆరోపించారు. మెగా కుటుంబానికి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయిన సందర్భంలో డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్ మేనేజర్లకు ఫోన్ చేసి వందల టికెట్లు తెప్పించుకొని అతని అనుచరులతో బ్లాక్ లో అమ్మించడం అతని నైజం అని ఆరోపించారు.
ఎన్నికలలో కేసీనాని నానికి అమ్ముడు పోయారని మరియు ఒక్క కార్పొరేటర్ అభ్యర్థినీ గెలిపించ గలిగే సామర్థ్యం లేదని ఆరోపించారు. భవానిపురంలో ఒక వికలాంగురాలు అధికార పార్టీ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే స్థానిక కార్పొరేటర్ తో లాలూచీ పడి విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా కప్పిపుచ్చారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తో నాగబాబు తో ఫోటోలు తీపిస్తానని కాపు యువకులను మరియు కార్యకర్తలను ప్రలోభాల గురి చేసి వారి దగ్గర నుండి చందాలు వసూలు చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోతే మహేష్ అన్న వ్యక్తి పక్కింటి వారికి కూడా తెలియదని పార్టీ అడ్డుపెట్టుకొని ఆయన అడ్డదిడ్డంగా సంపాదించి సొమ్ము పోగు చేస్తున్నారని మరియు నీ స్థానిక డివిజన్లోనే ఒక అభ్యర్థిని కూడా గెలిపించుకోలేని అసమర్థుడు అని ఎద్దేవా చేశారు.
తాజాగా ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి వైఎస్సార్ సీపీ జండా కూలీగా మారిపోయారని, పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పేలితే ఈ ఎలక్షన్లలో ప్రజా క్షేత్రంలో బట్టలూడదీసి నిలబెడతానని గట్టిగా హెచ్చరించారు.ఈ విలేకరుల సమావేశంలో సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ కేఎస్ఎన్ మూర్తి, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. శ్యాం ప్రసాద్, లీగల్ సెల్ కృష్ణాజిల్లా గంజి. పవన్ కృష్ణాజిల్లా కోఆర్డినేటర్ రాజనాయుడు, స్థానిక జనసేన డివిజన్ అధ్యక్షులు దాసరి నాగరాజు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News