Breaking News

సర్వ రోగాలకు ఖర్చులేని చికిత్స యోగా మాత్రమే..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ శక్తులన్నింటిని ఎకంచేసి సామాజిక స్థితి చేకూర్చి ఏకాగత్ర వలన అసలైన శక్తిని సాధించే యోగా సర్వ రోగాలకు ఖర్చులేని చికిత్స అని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు. అమరావతి యోగా మరియు యోరోబిక్స్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే వేసవి ప్రత్యేక యోగా తరగతులను సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాచీన పూరతన కాలం నుండే యోగా ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఆరోగ్యకర జీవితానికి శరీరం మనస్సుల మధ్య సమతౌల్యానికి యోగా ఎంతో దొహద పడుతుందన్నారు. మన దేశం ప్రపంచ మానవాలికి ఇచ్చిన గొప్ప కానుక యోగా అని అన్నారు. మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురై ఆనారోగ్యం భారిన పడుతున్నారన్నారు. ఆరోగ్య సమస్యల పరిష్కరానికి సహజసిద్దమైన సులభ మార్గం యోగా అన్నారు. ప్రజలలో మానసిక ఒత్తిడిని తగ్గించే యోగాకు ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలను అవలంభించడం ద్వారా మానసిక వత్తిడిని తగ్గించుకుని ఆరోగ్య వంతులుగా జీవించాలనే లక్ష్యంతో ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ధైనందిక జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యోగా ఆసనాల ద్వారా హైపర్‌ టెన్షన్‌, థైరాయిడ్‌, మధుమేహం వంటి వ్యాధులను ఆరికట్టడం ద్వారా ఆనారోగ్యం భారిన పడకుండా నిత్యయవ్వనవంతులుగా ఉండగలుగుతారన్నారు. యోగా సాధన దినచర్యగా మారిన నాడు ఔషదాల వినియోగం ఘననీయంగా తగ్గించగలుగుతామన్నారు.సర్వ రోగాలకు ఖర్చు లేని సరైన చికిత్స యోగాసనాలు మాత్రమేనని తల్లిదండ్రులు తమ పిల్లలను యోగా సాదన పట్ల ఆసక్తి కలిగించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు.
అమరావతి యోగా మరియు యోరోబిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2017 నుండి తమ అసోసియేషన్‌ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతి ఏటా 2 వేల మందికిపైగా ఉచితంగా యోగా శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అందించిన వారికి ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందించడం జరుగుతుందన్నారు. అంతార్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక యోగా శిక్షణ తరగతులను నిర్వహించి యోగా దినోత్సవం నాడు సర్టిఫికేట్లను, మెడల్స్‌, యోగా డ్రస్‌లను విద్యార్థులకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనతరం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు యోగా గురువు అంకాల సత్యానారాయణ పర్యవేక్షణలో విద్యార్థులతో కలిసి యోగా ఆసనాలను వేశారు.
డిసిపి టి.హరికృష్ణ మాట్లాడుతూ మనస్సు, ప్రశాంతత, బుద్ది తేజోవంతానికి యోగా ఎంతో దొహదపడుతుందన్నారు. యోగాను అచరించడం ద్వారా శరీరక మానసిక రోగాలకు పరిష్కారం లభిసుందన్నారు. ప్రాచీన, పురాతన కాలం నుండే యోగా ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఆరోగ్యకర జీవితానికి శరీరం, మనస్సుల మధ్య సమతౌల్యానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. సహజంగా యోగా విద్యను పట్టణ ప్రాంతాల ప్రజలే అచరిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు యోగా పట్ల ఆసక్తి కల్పించి వారికి యోగా శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ గ్రామంలో యోగా పట్ల ఆసక్తి కలిగిన ఒకరిద్దరిని గుర్తించి వారికి యోగాలో శిక్షణ అందించి వారి ద్వారా గ్రామ ప్రజలకు శిక్షణ అందించిన్నటైతే ఆరోగ్యవంతమైన జీవితాన్ని, మానసిక ఉల్లసాన్ని కల్పించగలుగుతామన్నారు. అతీతమైన ఆనందం, మనస్సు ప్రశాంతత, కల్మషంలేని మనస్సు కలిగి ఉన్నపుడు పరిపూర్ణమైన సుఖం యోగాతోనే సాధ్యమవుతుందన్నారు.
కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలిస్‌ కాశీ విశ్వనాథ్‌, యోగా గురువు అంకాల సత్యానారాయణ, అమరావతి యోగా మరియు యోరోబిక్స్‌ అసోసియేషన్‌ కోశా అధికారి ఎ. లావణ్య కుమార్‌, అర్గనైజింగ్‌ సెక్రటరి పి. ప్రశాంత్‌ కుమార్‌, కార్యవర్గ సభ్యులు కె. బాజి, ఎ. ప్రసాద్‌, ఎస్‌ వి ఆర్‌ నాయుడు, లీల, శ్రీనివాసరావు, సిరాజ్‌, యోగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *