Breaking News

“పాలిసెట్-2024“ నిర్వహణకు సర్వం సిద్దం : సురేష్ కుమార్


-442 కేంద్రాలలో ఏప్రిల్ 27వ తేదీన ప్రవేశ పరీక్ష
-వేసవి దృష్ట్యా అందుబాటులో మంచినీరు, వైద్య సదుపాయం
-ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా పరీక్షా కేంద్రాలకు ముందస్తుగా చేరుకోండి
-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా “పాలిసెట్- 2024“ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని నైపుణ్యాభివృద్ది శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్వహించే “పాలిసెట్- 2024“ నిర్వహణకు సంబంధించి గురువారం సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ కార్యాలయంలో హైబ్రీడ్ విధానంలో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష జరగనుంది. సురేష్ కుమార్ అన్ లైన్ లో సమీక్షలో పాల్గొని పలు కీలక సూచనలు చేసారు. వడగాలుల తీవ్రత నేపధ్యంలో ప్రతి కేంద్రం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి అత్యవసర మందులు సిద్దంగా ఉంచాలన్నారు. విద్యుత్త్ సరఫరాలో అంతరాయం లేకుండా అయా శాఖల అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి సమన్వయం చేసుకోవాలన్నారు. పదవ తరగతి తర్వాత ఉజ్వల భవిష్యత్తుతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉత్తమమైన మార్గం “పాలిటెక్నిక్ విద్య” మాత్రమేనని సురేష్ కుమార్ పేర్కొన్నారు. పాలిటెక్నిక్ పూర్తి అయిన వెంటనే సత్వర ఉపాధి కల్పించేందుకు వివిధ పరిశ్రమలతో ఒప్పoదములు చేసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ లేబరేటరీలను ఆధునీకరించి, వసతి కల్పనను సైతం మెరుగుపరచామని, ఎన్ బిఎ గుర్తింపు పొందిన 36 ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో విద్యార్ధులకు మరింత మెరుగైన విద్యనందించనున్నామని సురేష్ కుమార్ తెలిపారు.

సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఏప్రిల్ 27వ తేదీన జరిగే ప్రవేవ పరీక్షకు 442 కేంద్రాలలో 1,59,783 మంది ధరఖాస్తు చేసుకున్నారన్నారు. బాలికలు 64,538 కాగా, బాలురు 95,245 మంది ఉన్నారని, రాష్ట్రస్ధాయిలో పరీక్ష నిర్వహణకు 65 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. ఉదయం 8 గంటల తరువాత భద్రతా కేంద్రాల నుండి పరీక్షా పత్రాలు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటాయని, పదకొండు గంటలకు ప్రవేశ పరీక్ష ప్రారంభం అవుతుందని వివరించారు. ఒంటి గంటలోపు విద్యార్ధులను బయటకు అనుమింతబోమని నాగరాణి స్పష్టం చేసారు. 26 మంది జిల్లా స్దాయి పరీశీలకులు, 62 మంది సమన్వయ కేంద్రాల పరిశీలకులు, 442 మందిని పరీక్షా కేంద్రాల పరీశీలకులుగా నియమించామన్నారు. ప్రతి 24 మంది విద్యార్ధులకు ఒక ఇన్విజిలేటర్ ఉంటారని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు కోరామని తెలిపారు. ప్రతి కేంద్రంలోనూ మంచి నీరు అందుబాటులో ఉండేలా స్పష్టమైన అదేశాలు జారీ చేసామన్నారు. కొందరు విద్యార్ధులు ఆన్ లైన్ ఫీజు చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కోన్నారని, చెల్లుబాటు అయ్యే ధరఖాస్తును వారు పరీక్షా కేంద్రాలకు తీసుకువస్తే అక్కడ నేరుగా ఫీజు కట్టించుకుని హల్ టిక్కెట్టు ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రధానంగా అధికారులు, సిబ్బంది, విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు ముందస్తుగా చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని, సార్వత్రిక ఎన్నికల హడావుడి కారణంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. సమీక్షలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శి రమణబాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జానకీరామ్, ఉప కార్యదర్శి రవి కుమార్, సంయిక్త సంచాలకులు (అకడమిక్) సత్యన్నారాయణ మూర్తి, ఉప సంచాలకులు (టెక్) కళ్యాణ్, డిడి (అకడమిక్) విజయ భాస్కర్, ఉప కార్యదర్శి ప్రసాద బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *