Breaking News

తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ బ్యాలెట్ యూనిట్ల మొదటి విడత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ సంతృప్తికరంగా పూర్తి…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా మేరకు అవసరమగు తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ బ్యాలెట్ యూనిట్లకు మొదటి విడత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, కే జ్యోతి మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సంతృప్తికరంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా మేరకు అవసరమగు తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ బ్యాలెట్ యూనిట్లకు మొదటి విడత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సంతృప్తికరంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితా మేరకు చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గాలకు కలిపి ఇంకా బ్యాలెట్ యూనిట్లు 1133 అవసరం అవుతాయని, రిజర్వ్ లో అందుబాటులో ఉన్న 682 పోను అదనంగా 451 అవసరమవుతాయని, అలాగే ఇంకా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు 2566 అవసరం అవుతాయని, అందుబాటులో రిజర్వ్ లో ఉన్న 644 పోను అదనంగా 1922 అవసరమవుతాయని తెలిపారు. ఆ మేరకు సిఈఓ కార్యాలయం, బెల్ ఇంజనీర్లతో సమన్వయము చేస్తున్నామని తెలుపుతూ అందుబాటులో రిజర్వ్ లో ఉన్న 656 బ్యాలెట్ యూనిట్లకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం కొరకు మొదటి విడత సప్లిమెంటరీ ర్వాండమైజేషన్ ప్రక్రియ చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ ర్వాండమైజేషన్ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈవిఎం నోడల్ అధికారి కోదండరామి రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *