Breaking News

ఎక్స్పెండిచర్ విషయంలో ఎన్నికలలో పోటీ చేయుచున్న రాజకీయ పార్టీ అభ్యర్థులు జాగ్రత్త వహించాలి

-రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలి
-ప్రసార మాధ్యమాలలో రాజకీయ ప్రకటనల కోసం ఎంసిఎంసి నందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు.

మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు కె. జ్యోతి, తిరుపతి పార్లమెంట్ వర్గ నియోజకవర్గ ఎక్స్పెండిచర్ పరిశీలకులు ప్రదీప్ కుమార్, పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వేల్ లతో కలిసి ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్, ఎక్స్పెండిచర్ తదితర అంశాలపై తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం రాజకీయ పార్టీ అభ్యర్థులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ వారి మార్గదర్శకాలకు లోబడి ప్రతి రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో సజావుగా జరిగేలా అందరు సహకరించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో మే ఒకటవ తేదీ నుంచి బిఎల్ఓ ద్వారా ఇంటింటికి ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ కు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లను పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్త వహించి ఎన్నికల వ్యయంకు సంబంధించిన ప్రతి పైసా కూడా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే రాజకీయ సమావేశాలు నిర్వహించుకొనుటకు, ప్రసార మాధ్యమాల్లో రాజకీయ ప్రకటనలకు సంబంధించి సంబంధిత అధికారుల దగ్గర అనుమతి తప్పనిసరిగా పొందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం రాజకీయ పార్టీ అభ్యర్థులు, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *