Breaking News

వ్యాపార సామ్రాజ్యంగా మారనున్న పశ్చిమం

-సుజనా ఆలోచన విధానం-ప్రభుత్వానికి భారీ ఆదాయం
-పెరగనున్న ఉపాధి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజక వర్గం. ఇది ఒక వ్యాపార కేంద్రం. ఏపీలో ఇంత పెద్ద స్థాయి వాణిజ్య కేంద్రం ఏదీ లేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా పశ్చిమం వన్ టౌన్ పెద్ద స్థాయి వ్యాపార కేంద్రంగా ఉంది. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల నుంచి ఫాన్సీ, బంగారం,మందులు, వస్త్రలతలో వస్త్రాలు, కాళేశ్వరరావు మార్కెట్ లో ఫ్రెష్ కూరగాయలు… అవి ఇవీ అని కావు… ఇక్కడ దొరకని ఏవీ లేవని ఒక్క మాటలో చెప్పొచ్చు. హోల్ సేల్ ధరలకు వన్ టౌన్ లో అన్ని సామగ్రి లభ్యం కావడంతో నిత్యం దాదాపుగా వేలాది మంది ప్రజలు ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా పొరుగు ఊర్ల నుంచి వన్ టౌన్ కు వచ్చి వెళుతుంటారు. ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం సాగుతుంటుంది. అంతే కాదు ఈ వ్యాపారాలకు సంబంధించి వాటిపై ఆధార‍పడి ఎంతో మంది జీవనాధారం పొందుతున్నారు. ఇంత భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతున్న పశ్చిమంలో వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చేసుకునేందుకు వ్యాపారస్తులకు అండగా ఉండేందుకు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అనేక ప్రణాళికలతో కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. ఈ ప్రాంతంలో వర్తకం మరింతగా పెరిగే అవకాశాలపై సుజనా అధ్యయనం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన వర్తక సదస్సులో ప్రస్తావించారు. సుజనా సూచనలకు, వాటిని అమలు చేసే విధానాలకు వ్యాపారస్తులు ఆ సదస్సులో హర్షం వ్యక్తం చేశారు. అంతే కాదు పశ్చిమంలో వ్యాపారం మరింతగా వృద్ధి చెందితే తద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరిగే అవకాశంపై కూడా సుజనా వ్యాపారస్తులతో చర్చించారు. వ్యాపారం వృద్ధిపై సుజనా ప్రసంగించిన తీరుకు వర్తకులు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *