Breaking News

పారదర్శకంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఈవిఎం ల రెండవ దఫా ర్యాండమైజేషన్ పూర్తి : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆదివారం 23- తిరుపతి(ఎస్సి) పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈవిఎం ల రెండవ ర్యాండమైజేషన్ పారదర్శకంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

23- తిరుపతి (ఎస్ సి) పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు కే. జ్యోతి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికలలో పోటీ చేయుచున్న అభ్యర్థుల సమక్షంలో తిరుపతి పార్లమెంట్ ఈవిఎం లను (కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్) రెండవ దఫా ర్వాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించి పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు 4858, కంట్రోల్ యూనిట్లు 2429, వివిప్యాట్ 2633 లకు రెండవ దఫా ర్యాండమైజేషన్ పూర్తి అయ్యింది అని తెలిపారు.

ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఈఎంఎస్2.0 సాఫ్ట్ వేర్ లో ఆన్ లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు.

ఈ సమావేశంలో డి ఆర్ ఓ పెంచల కిషోర్, ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు చంద్ర శేఖర్, పవన్ కుమార్, రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి ప్రతినిధులు, స్వతంత్ర అభ్యర్థులు తదితర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *