Breaking News

పోలింగ్ మెటీరియల్ పంపిణీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13 జరగనున్న పోలింగ్ కు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన పోలింగ్ మెటీరియల్ పంపిణీకి ఏసి కాలేజిలో ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆదివారమ ఉదయం 7 గంటల నుండే పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. శనివారం ఏసి కాలేజిలో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ పంపిణీకి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని, పిఓలు, ఏపిఓలు ఉదయం 7 గంటలకే ఏసి కాలేజిలో రిపోర్ట్ చేయాలన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను 22 సెక్టార్ ల వారీగా విభజన చేసి, ప్రత్యేకంగా అధికారులను కేటాయించామని తెలిపారు. సెక్టార్ వారీగా టేబుల్స్, మెటీరియల్ ప్యాకింగ్ కు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. పిఓలు రిపోర్ట్ చేసిన వెంటనే వారికి పిడిఎంఎస్ యాప్ డౌన్ లోడ్, లాగిన్ చేయడం, అటెండెన్స్ కోసం సిబ్బందిని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *