విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలు ఎనలేనివని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.
Prajavartha Online Telugu News