Breaking News

ఉప ముఖ్యమంత్రి హోదాలో సచివాలయంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ 

-అమరావతిలో రాజధాని రైతుల అపూర్వ స్వాగతం
-దారి పొడవునా పూల వర్షంతో నీరాజనం
-సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో గంటన్నరపాటు సమావేశం
-పవన్ కళ్యాణ్ తోపాటు పాల్గొన్న మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో అడుగుపెట్టారు. ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అమరావతిలో అడుగుపెట్టిన ఆయనకు రాజధాని రైతులు, సచివాలయంలో ఉద్యోగులు అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ని తాడేపల్లి వద్ద ప్రజలు పూల వర్షంతో ముంచెత్తారు. అక్కడి నుంచి కరకట్ట మీదుగా వెంకటపాలెం చేరుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో రాజధాని రైతులు, ప్రజలు గజ మాలలతో ఘనంగా సత్కరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం వరకు పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు గతంలో మందడం వచ్చి పవన్ కళ్యాణ్  మద్దతు పలికిన విషయం విదితమే. మందడం గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ కి చెక్కతో తయారుచేసిన నాగలి బహూకరించారు.
అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అధికారికంగా సచివాలయంలో ప్రవేశించారు. పవన్ కళ్యాణ్ రాక విషయం తెలుసుకుని సచివాలయం నాలుగు బ్లాకుల ఉద్యోగులు బయటకు వచ్చి స్వాగతం పలికారు. రాజధాని రైతులు, ప్రజలతోపాటు సచివాలయం ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్  సమావేశం
సచివాలయంలో అడుగుపెట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా మొదటి బ్లాక్ లోని సీఎం ఛాంబర్ కి వెళ్లి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు తో సమావేశం అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడు ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఇరువురూ సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ తోపాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, చంద్రబాబు నాయుడు ని కలిశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *