Breaking News

బందర్ పోర్ట్ పనులు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందర్ పోర్ట్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పోర్ట్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. బందరు పోర్టు పనుల పురోగతి, భూ సమస్యలు వాటి పరిష్కారం పై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని, అవరోధంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా భూ సమస్యల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కాకూడదని, అవసరమైన పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పెండింగ్ చెల్లించుటకు చర్యలు తీసుకోవాలన్నారు జూలై 5న మరల పోర్టు పనుల పురోగతిపై సమీక్షిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, ఏపీ మ్యారీ టైం బోర్డు ఎండి విద్యాశంకర్, బందర్ ఆర్డీవో ఎం వాణి, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపర్నెంట్ తేజేశ్వరరావు, బందర్ తాసిల్దార్లు తోట సతీష్ (ఈస్ట్) వెంకటేశ్వరరావు (వెస్ట్) తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *