Breaking News

రెవెన్యూ డే రోజున రెవెన్యూ శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టడం రెవెన్యూ శాఖ కు మంచి శుభపరిణం

-బొప్పరాజు, పలిశెట్టి మరియు కె.రమేష్ కుమార్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రెషన్స్ శాఖామాత్యులుగా గురువారం భాద్యతలు చేపట్టిన అనగాని సత్య ప్రసాద్ నీ కలసి వారికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మరియు ఏపి జేఏసీ అమరావతి పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.

జూన్ 20వ తేదీ ” రెవెన్యూ డే ” సందర్భముగా రెవెన్యూ శాఖామాత్యులు గా భాద్యతలు చేపట్టి, రెవెన్యూ డే సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో వారి ఛాంబర్ లో మంత్రి  ” రెవెన్యూ డే ” కేక్ కట్ చేయడం రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ ఉద్యోగికి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా రెవెన్యూ శాఖామాత్యులు గా భాద్యతలు చేపట్టిన రెవెన్యూ శాఖామాత్యులు కి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన చిరు సత్కారం చేయడమైనది.

గత మొఘలుల పాలన నుండి రెవెన్యూ శాఖ ఉన్నప్పటికీ, బ్రిటిష్ వారి హయంలో 1786 జూన్ 20వ తేదీ మద్రాస్ ప్రెసిడెన్సీ లో ” బోర్డు ఆఫ్ రెవెన్యూ ” ఏర్పాటు చేయడం, తదనంతరం 191 సంవత్సరాల తర్వాత అనగా 1977లో బోర్డు ఎత్తివేసి, కమిషనర్ హోదాలో రెవెన్యూ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1999లో చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ గా రూపాంతరం చెంది, ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుంది.

అదేవిధముగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ శాఖ తరపున భవిష్యత్ లో చేపట్టాల్సిన భూ వ్యవహారాల సమస్యలతో పాటు, ప్రజలకు అందించే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే విధముగా రెవెన్యూ ఉద్యోగులు అందరు ప్రభుత్వానికి పూర్తి సహకారము అందించి, రెవెన్యూ శాఖ ఖ్యాతిని పెంచే విధముగా రెవెన్యూ ఉద్యోగులు అందరు రేయీoబవల్లు కష్టపడి పనిచేస్తారని బొప్పరాజుగారు తెలియచేసారు.

నూతన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వివి మురళీ కృష్ణ నాయుడు అన్నారు.

ఈ శుభాకాంక్షలు తెలియజేసిన కార్యక్రమంలో ఏపి రేవిన్యూసర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రమేష్ కుమార్, ట్రెజరర్ నరసింహరావు, వైస్ ప్రెసిడెంట్ N. శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ పుట్ట జాహ్నవి, ఏపి ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, ఏపీ క్లాస్ -IV ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్. మల్లేశ్వరరావు, ఏపీ జెఏసి అమరావతి మహిళా విభాగం చైర్ పర్సన్ శ్రీమతి పారే లక్ష్మి, సెక్రటరీ జెనరల్ పొన్నూరు విజయలక్ష్మి, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య, మున్సిపల్ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ దోప్పలపూడి, CCLA యూనిట్ కార్యదర్శి D.వెంకటేశ్వరరావు, ఏపీ జేఏసీ అమరావతి సిటి యూనిట్ ప్రెసిడెంట్ R దుర్గ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా అద్యక్ష కార్యదర్శులు డి.శ్రీనివాస్, బత్తిన రామకృష్ణ తధితరులు కలసి శుభాకాంక్షలు ఏపిజేఏసి అమరావతి మరియు అనుబంద సంఘాల రాష్ట్రకమిటి నాయకులు అందరు కలసి మంత్రి కి శుభాకాంక్షలు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *