Breaking News

ఆయుష్ హాస్పిటల్స్ ఏర్పాటుకు కు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంపీకప్స్ డైరెక్టర్ డా. వేముల భానుప్రకాష్ మరియు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా డాక్టర్స్ సెల్ కన్వీనర్ డా. మహేంద్రకుమార్ యాదవ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ని సెక్రటేరియట్ లో ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ ఏర్పాటు, ఆయుష్ వైద్యులకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లులు రాబోవు మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టేటట్లు చూడాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. రీయింబర్సుమెంట్ ఎంపానెలమెంట్ గైడ్లైన్స్ ఫర్ ఆయుష్ హాస్పిటల్స్ ఏర్పాటుకు కు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. విలేజ్ క్లినిక్స్ లో కూడా ఆయుర్వేద గ్రాడ్యుయేట్ లను తీసుకోవాలని కోరగా, ఆ విషయం పై చర్చిస్తున్నాము అన్నారు. చివరగా ప్రభుత్వ, ప్రైవేట్ కి సంబంధించిన ఆయుష్ స్టేక్ హోల్డర్లు తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఆయుష్ వైద్యుల సమస్యలు ని ఎంతో ఓపికగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అని హామీ ఇచ్చిన ఆరోగ్యశాఖా మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *