Breaking News

రెవిన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
రెవిన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర రావు లతో కలిసి ఆర్డీవోలు, తహసిల్దార్లతో భూముల అలీనేషను, ముటేషన్, నీటి పన్ను వసూలు, సమగ్ర కుల ధ్రువీకరణ పత్రాలు జారీ తదితర రెవిన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. మండలాల వారీగా ఉన్న భూములు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు అందుకు సంబంధించిన రేఖా చిత్రపటాలను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు, రైల్వే లైన్లు, రహదారుల తదితర అభివృద్ధి పనులు చేపట్టుటకు అవసరమైన భూములను కేటాయించడం కోసం అలినేషన్, ముటేషన్ తదితర ప్రతిపాదనలను వచ్చే వారంలోగా సిద్ధం చేసి పంపాలని సూచించారు. అలాగే 1433, 1434 ఫసలీల నీటి పన్నులు రైతుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేయవలసి ఉందని, ఇప్పటివరకు కేవలం 6 లక్షలు రూపాయలు మాత్రమే వసూలు చేశారని, నీటి పన్ను చెల్లించుటకు రైతులు సిద్ధంగా ఉన్నారని, సాగునీటి కాలువలు బాగు చేయించాలని వారు కోరుతున్నారని, ఆ దిశగా దృష్టి సారించి త్వరితగతిన నీటి పన్ను వసూలు చేయాలన్నారు. ముఖ్యంగా మచిలీపట్నం డివిజన్లో 14 కోట్ల రూపాయల వరకు నీటి పన్ను వసూలు కావాల్సి ఉందని చెప్పారు.

సమగ్ర కుల ధృవీకరణ పత్రం జారీలో చాలా జాగ్రత్తలు పాటించాలని, రోజుకు 5 నుంచి 7 ధ్రువీకరణ పత్రాలు మాత్రమే జారీ చేయాలని అది కూడా సరిగా చేయకపోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి శుక్రవారం తాను రెవెన్యూ అంశాల పైన సమీక్షించడం జరుగుతుందని అందుకు తగ్గట్టుగా ప్రతి రెవెన్యూ అధికారి వారికి అప్పగించిన పనులను పూర్తి చేసి, సంబంధిత రికార్డులతో సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డిఓలు ఎం. వాణి, పి పద్మావతి, డి రాజు, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎం మధు, పలువురు తహసీల్దారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *