Breaking News

ఈనెల 8 నుంచిఉచిత ఇసుక విధానం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత ఇసుక విధానం ఈ నెల 8వ తేదీ సోమ‌వారం నుంచి జిల్లాలో ప‌టిష్టంగా అమ‌లుచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శ‌నివారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌భ్ కుమార్ ప్ర‌సాద్‌ ఉచిత ఇసుక విధానం అమలుపై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. జిల్లా క‌లెక్ట‌ర్ అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమ‌లుచేసేందుకు ప్రభుత్వ విధి విధానాలు, జిల్లాలో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై సీఎస్ నీర‌భ్ కుమార్ ప్ర‌సాద్ జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో పారదర్శకంగా అమ‌లుచేసేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. క్షేత్ర‌స్థాయి అధికారుల‌కు విధివిధానాల‌పై సూచ‌న‌లు ఇవ్వాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు, గనులశాఖ ఏడి ప్రతాపరెడ్డి, డిపిఓ ఎస్ వి నాగేశ్వర నాయక్, ఎస్ ఈ బి డి ఎస్ పి జి పాండురంగారావు, రవాణా శాఖ అధికారి సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *