Breaking News

కుటుంబ నియంత్రణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారికి నగదు పారితోషికం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డీ.కే. బాలాజీ జిల్లాలో కుటుంబ నియంత్రణ పద్ధతులు అమలు చేయుటలోను, ఆచరించుటలోనూ అత్యధిక ప్రతిభ కనబరిచిన వైద్య సిబ్బందికి మరియు దంపతులకు నగదు పారితోషికంతో పాటుగా ప్రశంసా పత్రమును బహుకరించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యారోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు జనాభా పెరుగుదల వలన కలిగే ఆర్థిక, సాంఘిక ,ఆరోగ్య పరమైన అంశాల పట్ల అవగాహన కల్పించి బాల్య వివాహాలను నిరోధించి కుటుంబ నియంత్రణ పాటించే విధంగా బిడ్డకు బిడ్డకు ఎడమ ఉండేటట్లు తాత్కాలిక పద్ధతులు పాటిస్తూ మాతా శిశు ఆరోగ్యాన్ని సంరక్షించుటట్లుగా ప్రణాళికలు తో కూడిన కుటుంబ సంక్షేమాన్ని కలిగి ఉండేటట్లు అవగాహన కల్పించవలసినదిగా ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో లక్కీ డీప్ ద్వారా జిల్లాలో తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన పిపిఐయుసిడి ని వాడిన షేక్ షబీనా , వ్యాసక్టమి చేయించుకున్న కరంకి రాజేశ్వరరావు ,అంతర్ ఇంజక్షన్ చేయించుకున్న ఎం. లలితా లకు ఐదువేల రూపాయలు చొప్పున నగదు పారితోషికం తో పాటు ప్రశంసా పత్రమును బహుకరించినారు. అదేవిధంగా జిల్లాలో అత్యధిక పిపిఐయూసీడీలను వేసిన గైనకాలజిస్టులు డాక్టర్ జి. కిరణ్మయి ,డాక్టర్ ఆర్. జయప్రదలకు ప్రధమ ,ద్వితీయ బహుమతులు 8000/- ,5000/- లు చొప్పున ప్రశంసా పత్రంతో బహుకరించడమైనది. జిల్లాలో అత్యధిక వ్యాసక్టమిలు చేసిన డాక్టర్ పి. హరి రంగ ప్రసాద్ కు 7000/- తో పాటు ప్రశంసా పత్రమును ఇచ్చినారు .జిల్లాలో లక్కీ డీప్ ద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులకు దంపతులను మోటివేట్ చేసిన స్త్రీ ఆరోగ్య కార్యకర్తలు వి. సునీత ,టి .శారద లకు 2500/- చొప్పున నగదు బహుమతి తో పాటు ప్రశంసా పత్రమును ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి, గుడివాడ ప్రాంతీయ వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ ఇందిరా దేవి మరియు కార్యాలయ సిబ్బంది బి.శివ సాంబి రెడ్డి ,వి .ఆనంద్, బి.రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సీఎం సానుకూలం : మంత్రి నారాయణ

-సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడుతా : నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *