Breaking News

ప్రశాంత వాతావరణంలో ముగిసిన యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షలు- 2024

-ఉదయం పేపర్ 1 పరీక్షకు 55.71 శాతం, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షకు 55.80 శాతం మంది హాజరు : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఆదివారం జరిగిన యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్- 2024 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారము ఉదయం 9:30 నుండి 11:30 మధ్యాహ్నం 2.00 నుండి 4:30 గంటల వరకు రెండు సెషన్ల లో పరీక్ష నిర్వహణ జరిగిందనీ, తిరుపతిలో నిర్వహించిన 3 పరీక్షా కేంద్రాల లో యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షలకు 1199 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 668 మంది 55.71 శాతంగా, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షకు 669 మంది 55.80 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుండి బందోబస్తు నడుమ సంబంధిత పరీక్ష కేంద్రాలకు తరలించడం జరిగిందని, అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని తెలిపారు. కేంద్ర యుపిఎస్సి నిబంధనల మేరకు అన్ని విధాల పకడ్బందీ చర్యలు చేపట్టి పరీక్షలు నిర్వహించామని, అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *