Breaking News

అర్చకుని కుటుంబంపై దాడి బాధాకరం

– వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం దాడుల సంస్కృతి దేవాలయాల వరకు ప్రాకడం బాధాకరమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చిత్తూరు చెంగల్రాయకొండపై వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అర్చకుని కుటుంబంపై టీడీపీ నేత లోకేష్ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం నాయకులు అధికారాన్ని చూసుకుని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చివరకు దేవుడి సేవకు అంకితమైన అర్చక కుటుంబంపై దాడికి తెగబడటం అధికార పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజలందరూ బాగుండాలని పూజలు చేస్తూ.. సమాజ హితాన్ని కాంక్షించే అర్చకుల పట్ల దాడికి తెగబడే వారు ఎవరైనా పార్టీలకతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులు ఈ దాడిని వీడియో కూడా తీశారని.. దాని ఆధారంగా నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అర్చకులు/ పురోహితులపై దాడులు జరగకుంగా.. వారి హక్కులను కాపాడే విధంగా కఠినమైన చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *