Breaking News

చేనేత సహకార సంఘాలకు రూ.11.17 కోట్ల రుణ మంజూరు ప్రతిపాదన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.11.17 కోట్ల రుణ మంజూరుకు కమిటీ సభ్యులు ప్రతిపాదించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లాలోని 25 చేనేత సహకార సంఘాలకు కేడీసీసీ బ్యాంకు ద్వారా రుణ మంజూరు కమిటీ సభ్యులు ప్రతిపాదించారు.

గూడూరు మండలంలోని పోలవరం, కప్పలదొడ్డి, రాయవరం, మల్లవోలు, ఐదుగుళ్లపల్లి, పెడన టౌన్, చల్లపల్లి, గన్నవరం మండలంలోని ముస్తాబాద్ ప్రాంతాలకు చెందిన 25 చేనేత సహకార సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్ కింద రుణ మంజూరుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు, రాజమహేంద్రవరం డి ధనుంజయ రావు, ఏడి రఘునందన్, డిస్ట్రిక్ట్ కోపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ భాస్కరరావు, మార్కెటింగ్ ఆఫీసర్ ఆప్కో విజయవాడ బిఎస్ ప్రసాద్, వీవర్స్ సర్వీస్ సెంటర్ సూపరింటెండెంట్ ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *