రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
రేణిగుంటలోని విమానాశ్రయం సమీపంలో గల గురుకుల పాఠశాలను ఆదివారం సాయంత్రం ఏపీ స్టేట్ ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని తరగతుల గదులను విద్యార్థుల నైపుణ్యాన్ని అడిగి తెలుసుకుంటూ మమేకమయ్యారు. భోజనశాల, పడకగదులను, త్రాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించి లోటుబాటుల గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. పేదరికంతో నివాసాలను వదిలి హాస్టల్లో చదువుకునే విద్యార్థులు విద్యను గొప్పగా అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. వారికి ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే తమ దృష్టికి తీసుకురావచ్చని తెలియపరిచారు. పాఠశాలలోని లోటుపాట్లు సరిదిద్దుకోవాలని మరల ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ద్వారా చర్యలను తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డి.టి.డబ్ల్యూ. ఓ సూర్యనారాయణ, ఇంచార్జ్ ప్రిన్సిపల్ హరిబాబు, స్కూల్ కమిటీ చైర్మన్ కుప్పం రాజేష్, టీచర్స్ మోహన్ బాబు, ఉమాదేవి, రజని, రాధా బాయ్, పద్మ, అన్నపూర్ణ, అంజి, శ్రీనివాసులు, వేదవతి, రమేష్, హేమంత్, పిడిఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News