-ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా లోని బుడమేరు ముంపు ప్రాంతాలలో అకాలంగా వరద ముంపు సంభవించి ముంపు ప్రాంతంలోని చాలా పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని.. ముఖ్యంగా లక్షల మంది ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలోకి వరద నీరు బురదచేరి సదరు కార్యాలయంలోని ఆఫీస్ ఫర్నిచర్ పరికరాలు ఎక్కువ మొత్తంలో పూర్తిగా ద్వంశమైనవి అని.. సదరు కారణంగా అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలకు పోస్ట్ ఆఫీస్ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాలేదని ఇప్పటికైనా సదరు పోస్ట్ ఆఫీస్ శాఖ అధికారులు సిబ్బంది అజిత్ సింగ్ నగర్, క్రిష్ణా హోటల్ వద్ద గల అజిత్ సింగ్ నగర్ పోస్ట్ ఆఫీస్ నందు సదరు సర్వీస్ లను త్వరితగతిన తక్షణమే తిరిగి పునరుద్ధరించాలని.. ముఖ్యంగా బుడమేరు వరద కారణంగా లక్షలాదిమంది నివాసాలు ముంపుకు గురై చాలామంది ఆధార్ కార్డులను సైతం కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని.. అధికారులు తక్షణమే యుద్ద ప్రాతిపదికన నూతన ఆధార్ కార్డు నమోదు సర్వీస్ లను, సదరు పేరు చిరునామాలలోని మార్పులు చేర్పులకు సంబంధించిన సర్వీసులను కూడా అందుబాటులోకి తేవాలని.. బుడమేరు వరద ముంపు ప్రాంతాలలో ప్రత్యేకంగా ఆధార్ నమోదు క్యాంపులను ఏర్పాటు చేసి బాధితులకు బుడమేరు వరద ముంపు బాధితులకు తిరిగి నూతన ఆధార్ కార్డులను అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ.) ఆంధ్ర ప్రదేశ్ తరపున పోస్టల్ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Prajavartha Online Telugu News