Breaking News

విద్యార్థులకు రెడ్యూస్ రియూస్ రీసైకిల్ విజ్ఞాన కేంద్రం ద్వారా అవగాహన

-స్వచ్ఛత హి సేవలో రెడ్యూస్ రియూస్ రీసైకిల్ పై విస్తృతమైన కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛతాహి సేవ అంటూ సెప్టెంబర్ 17 నుండి మొదలైన స్వచ్ఛత హి సేవా కార్యక్రమాల్లో భాగంగా, రెడ్యూస్ రీసైకిల్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు విజయవాడ నగర పాలక సంస్థ. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు బుధవారం ఉదయం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు RRR విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది.

అందులో భాగంగా ఎం.కే బేగ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అజిత్ సింగ్ నగర్ ఎక్స్ఎల్ ప్లాంట్ లో గల RRR విజ్ఞాన కేంద్రంలో రెడ్యూస్ రీసైకిల్ మీద అవగాహన కల్పించారు అందులో భాగంగా వ్యర్థ పదార్థాల నిర్వాహన గురించి ఆ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడమే కాకుండా మనం రోజు వాడే వస్తువుల్లో రెడ్యూస్ రీ యూస్ రీసైకిల్ అనే అంశం ని ఎలా పాటించాలి అన్న దాని గురించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు అంతేకాకుండా విజ్ఞాన కేంద్రంలో ఉన్న రెడ్యూస్ రీసైకిల్ పద్ధతిని ఎలా జరుగుతుంది ఏంటి విజయవాడ నగరంలో ఉన్న ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ విషయాల పైన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎక్సెల్ ప్లాంట్ లో ఫ్లవర్ వేస్ట్ మేనేజ్మెంట్, విండో కంపోస్టింగ్, వర్మి కంపోస్ట్ ప్లాంట్, బయో మిథనేషన్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మ్యానేజ్మెంట్ ప్లాంట్ల, మినీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ట్రీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ స్క్రాప్, స్క్రాప్ ప్లేసింగ్ యూనిట్, మాట్రేస్స్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, సి&డి వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ ద్వారా వచ్చే రీసైకిల్డ్ వస్తువులను విద్యార్థినీ విద్యార్థులకు చూపించి, వారు కూడా రెడ్యూస్, రీ యూస్, రీసైకిల్ ద్వారా వచ్చే వస్తువులనే వాడాలని అవగాహన కల్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *