-ఎంపి కేశినేని శివనాథ్
-కలెక్టర్ కార్యాలయం లో మీడియాకి వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు కారణంగా నీట మునిగి నష్టపోయిన చిరు వ్యాపారస్తులను ఆదుకునేందుకు ఎం.ఎస్.ఎం.యు కార్పొరేషన్, ఇన్య్సూరెన్స్ కంపెనీల ద్వారా 30% శాతం నగదు అడ్వాన్స్ గా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు వరద బాధితులకు నష్టపరిహారం గా అందించే ఆర్థిక సాయం విడుదల చేసిన అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు.
సీఎం చంద్రబాబు వరద బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఇన్య్సూరెన్స్ కంపెనీలు, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ నెల 30వ తారీఖు లోపు ఇన్య్సూ రెన్స్ క్లెయిమ్స్, బ్యాంక్ లోన్ రీ షెడ్యూల్ పూర్తి చేసి బాధితులను ఆదుకోవాలని ఇన్య్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే వరద ముంపు కారణంగా 6 వేల టీవీ లు రిపేర్ కి రాగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4,500 టీవీ లు బాగు చేసినట్లు తెలిపారు. మిగిలిన 1500 టివిలు ఒక వారం రోజుల్లో బాగు చేస్తామని ఎలక్ట్రానిక్ సంస్థలు తెలిపినట్లు పెర్కొన్నారు. వరదల ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన విజయవాడ నగరాన్ని, ప్రజల్ని సాధారణ స్థితికి తీసుకురావడమే కాకుండా వరద బాధితులకి మరింత అండ గా ఉండేందుకు ఆర్థిక సాయం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ప్రజలందరీ తరుఫున ఎంపి కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News