Breaking News

జిల్లా అధికార యంత్రాంగం కృషి భేష్‌

-క‌లెక్ట‌ర్ బాగా ప‌నిచేశారంటూ ముఖ్య‌మంత్రి ప్ర‌శంస‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ప‌రంగా సేవ‌లందించ‌డంలోనూ.. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో న‌ష్ట గ‌ణ‌న నిర్వ‌హించ‌డంలోనూ జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న అధికార యంత్రాంగాన్ని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించారంటూ ముఖ్య‌మంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంసించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి బుధ‌వారం ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో బ్యాంకింగ్‌, బీమా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో పాటు ఎన్యూమ‌రేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగ‌మైన జిల్లా అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మొద‌లు క్షేత్ర‌స్థాయి యంత్రాంగం వ‌ర‌కు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఏ విధంగా భాగ‌మ‌య్యార‌నే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. సంఘ‌టిత శ‌క్తి వ‌ర‌ద విప‌త్తు నిర్వ‌హ‌ణ‌లో కీల‌క‌మైన సంద‌ర్భాన్ని వివ‌రిస్తూ జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న ప‌నితీరును ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. బాగా ప‌నిచేశార‌ని.. జిల్లా అధికార యంత్రాంగాన్ని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించారంటూ కితాబిచ్చారు. వరద నీటిలో లక్షలమంది చిక్కుకున్నార‌ని.. అన్నిరకాల నీళ్లు కలిసిపోయాయని, డ్రెయిన్లు పొంగి, మురుగునీరు కలిసిపోయి కనీసం మంచినీరు తాగే పరిస్థితి కూడా లేదని, కనీవిని ఎరుగని విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. అంతా సర్వశక్తులు ఒడ్డి సహాయక చర్యల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
విజ‌య‌వాడ‌, కృష్ణా జిల్లా ప్రాంతంలో 200 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వ‌ర్ష‌పాతం, రికార్డు స్థాయిలో ప్ర‌కాశం బ్యారేజీకి వ‌ర‌ద‌,
బుడ‌మేరు గండ్ల నుంచి పోటెత్తిన వ‌ర‌ద‌తో విజ‌య‌వాడ‌లో స‌గానికి స‌గం ప్రాంత ప్ర‌జ‌లు ముంపు ప్ర‌భావానికి గుర‌య్యారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని క్యాంపు కార్యాల‌యంగా మార్చుకొని నిరంత‌రం స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. అంత‌కుముందే క్షేత్ర‌స్థాయి అధికారుల‌ను స‌హాయ‌క శిబిరాల ఏర్పాటు, ప్ర‌జ‌ల త‌ర‌లింపు త‌దిత‌ర అంశాల‌పై వ‌రుస టెలీ కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌చ్చిన క‌లెక్ట‌ర్‌.. ఆగ‌స్టు 31వ తేదీ నుంచి స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో మ‌రింత త‌ల‌మున‌క‌ల‌య్యారు. బాధితుల‌కు ఆహారం, పాలు, నీళ్లు.. వంటివి అందించ‌డంలో బృందాల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక అధికారులు, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తూ ముందుకెళ్లారు. కంట్రోల్ రూం నుంచి ప‌రిస్థితిని నిరంత‌రం స‌మీక్షిస్తూ క్షేత్ర‌స్థాయి అధికారుల‌కు మార్గ‌నిర్దేశం చేశారు. ఎన్‌డీఆర్ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్‌, ఆహార స‌ర‌ఫ‌రా, పున‌రావాస శిబిరాలు.. ఇలా వివిధ ర‌కాల టీమ్‌ల‌నూ స‌మ‌న్వయం చేయ‌డంలోనూ క‌లెక్ట‌ర్ త‌న‌దైన పాత్ర పోషించారు. వ‌ర‌ద బాధితులను సాధార‌ణ స్థితికి తీసుకురావ‌డంలో కీల‌క భాగ‌స్వాములయ్యారు. బాధితుల‌కు రేష‌న్ అందించ‌డం, న‌ష్ట గ‌ణ‌న చేయ‌డం, బ్యాంకింగ్‌, బీమా సేవ‌లు అందించ‌డం, అర్బ‌న్ క్లాప్ సేవ‌లు స‌రైన విధంగా అందేలా చూడ‌టం.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ క‌లెక్ట‌ర్ కృషి ప్ర‌శంసనీయం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *