Breaking News

దసరా ఉత్సవాలలో ఎన్టీఆర్ జిల్లా ఇండియన్ సొసైటీ రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు అనిర్వచనీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఇండియన్‌ సొసైటీ రెడ్‌ క్రాస్‌ వాలంటీర్లు పొట్టిశ్రీరాములు కాలేజీ, వివిధ కళాశాల వాలంటీర్లు రెండవ రోజు వివిధ ప్రాంతాలలో క్యూలైన్లను నియంత్రణ, మంచినీటి సరఫరా, వృద్ధులు, వికలాంగుల సేవలు, తదితర సేవలు అందించారు. వృద్ధులను, వికలాంగులను వీల్‌ చైర్‌ లో కూర్చోబెట్టి తీసుకువెళ్లి దర్శనం చేయంచడం అందరని అబ్బుర పరిచింది. అమ్మవారి దర్శనానికి వృద్ధులు, వికలాంగులు తమకు సేవలు అందించిన వాలంటీర్లు అయిన విద్యార్థులను ఆనందంతో కళ్ళ నీళ్లతో ఆశీర్వదించారు. ఇండియన్‌ సొసైటీ రెడ్‌ క్రాస్‌ వాలంటీర్‌ సాయివర్థన్‌ (పొట్టిశ్రీరాములు కాలేజీ, విద్యార్ది) మాట్లాడుతూ దుర్గమ్మవారి సన్నిధిలో వృద్ధులు, వికలాంగుల సేవలు చేసే అవకాశాన్ని కల్పించిన ఇండియన్‌ సొసైటీ రెడ్‌ క్రాస్‌, పొట్టిశ్రీరాములు కాలేజీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం వాలంటీర్‌గా నా బాధ్యత అని తెలిపారు. ఇది మా పెద్దలు చేసిన సేవగా భావిస్తున్నానని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *