Breaking News

బాల్యం నుండి క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్యం నుండి క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థులకు ఉద్బోధించారు. స్థానిక చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హైస్కూల్ ను మంగళవారం మంత్రి సందర్శించి ఎన్సిసి క్యాడేట్లకు యూనిఫాం పంపిణీ గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్సిసి ద్వారా క్రమశిక్షణ, నాయకత్వం అలవడుతుందని, మాతృభూమికి సేవ చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. దేశ నాయకులలో ఎంతోమంది ఎన్సిసి ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని దేశానికి ప్రజలకు సేవ చేసి కీర్తి గడించిన వారేనని అన్నారు. స్థానిక నాయకులు బండి రామకృష్ణ మాట్లాడుతూ మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కూడా ఎన్సిసి శిక్షణ ద్వారా కటోర శ్రమ అలవర్చుకున్న వారేనని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూవీ కృష్ణమూర్తి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం, 9వ డివిజన్ ఇంచార్జి కొట్టే వెంకట్రావు, స్థానిక నాయకులు కుంచే నాని, డిప్యూటీ డిఇఓ శేఖర్ సింగ్, ఎంఈఓలు దుర్గాప్రసాద్, గురు ప్రసాద్, విద్యా కమిటీ చైర్మన్ సతీష్, ఎన్సిసి అధికారి ఏ.వి. రామాంజనేయులు, పిడి రమేష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *