Breaking News

ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు – ఉచిత డీఎస్సీ శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 21
-అక్టోబరు 22 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
-పరీక్ష నిర్వహించే తేదీ అక్టోబర్ 27
-ఇన్చార్జి జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సందీప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు చెందిన షెడ్యుల్డ్ కులముల మరియు షెడ్యుల్డ్ తెగల అభ్యర్ధులకు డి. యస్. సి. పరీక్ష కొరకు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యములతో కూడిన మూడు నెలల పాటు శిక్షణ పొందుటకు http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు నమోదు చేసుకొనుటకు తేది: 11.10.2024 నుండి తేది: 21.10.2024 వరకు అవకాశం కల్పించడ మైనదని ఇన్చార్జి జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి ఎమ్ సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ శిక్షణా తరగతులకు ఎస్.జి.టి.లకు ఇంటర్మీడియట్ తో పాటు డైట్ సెట్ మరియు టెట్, స్కూల్ అసిస్టెంట్స్ కు డిగ్రీ గ్రాడ్యుయేషన్ మరియు బి.ఈడి మరియు టెట్ విద్యార్హతలు కలిగినవారు అర్హులు అని పేర్కొన్నారు. అభ్యర్ధుల కుటుంబ వార్షికాదాయం రూ.2,50,000/-ల లోపు ఉండాలన్నారు. అభ్యర్థులనీ ఆన్లైన్ / ఆఫ్-లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడును. కావున ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొనుటకు ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొనవలసినదిగా కోరారు .

* ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువు : 21.10.2024 వరకు.

* హాల్ టికెట్స్ డౌన్ లోడింగ్ : 22.10.2024 నుండి 25.10.2024 వరకు.

* పరీక్ష తేది:27.10.2024.

* మెరిట్ లిస్ట్ ప్రకటన తేదీ: 28.10.2024.

* జిల్లాల వారీగా ఎంపికైన వారి లిస్టు ప్రకటన: 30.10.2024.

* కోచింగ్ సెంటర్ వారీగా అభ్యర్థుల ఎంపిక తేదీ: 03.11.2024.

* కోచింగ్ మొదలుపెట్టు తేదీ: 06.11.2024.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *