Breaking News

మేళా మెగా జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :

సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు నెలవల విజయ శ్రీ ఆదేశాల మేరకు రేపు అనగా 22-10-2024 తేదీన జాబ్ సూళ్లూరుపేటలో మేళా మెగా జాబ్ మేళా నిర్వహించబడును

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 22- 10-2024 తేదీన అనగా ఈ మంగళవారం సూళ్లూరుపేట లోని శ్రీ సత్య సాయి కళ్యాణ మండపం, షార్ రోడ్ , సూళ్లూరుపేట (Sri Sathya Sai Kalyana Mandapam,Shar Road,Sullurupeta)నందు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ పార్లమెంట్ సభ్యులు తిరుపతి మరియు సూళ్లూరుపేట నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ మరియు Dr నెలవల విజయ శ్రీ, శాసనసభ్యులు, సూళ్లూరుపేట నియోజకవర్గం స్వయం సహకారాలతో మరియు ఆదేశాల ప్రకారం ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడును.

ఇందులో భాగంగా చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం, శ్రీ సిటీ మరియు మేనకూరు సేజ్ లోని 24బహుళ జాతీయ కంపెనీలలో 1200 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఐదవ తరగతి పైన చదువుకున్న మరియు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ మెగాజాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను అని తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి,ఆర్ లోకనాథం, ఒక ప్రకటనలో తెలియజేశారు మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.

రిజిస్ట్రేషన్ లింకు: https://shorturl.at/vsQg7

రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 21-10-2024.

ఇతర వివరములు కొరకు సంప్రదించండి: 9154449677(P Suneel),9491458910(I Hari Krishna) ..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *