విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
49వ డివిజన్ పరిధిలోని పెనుమాక దేవదాసు వీధిలో బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానిక మహిళలతో కలిసి సోమవారం సైడ్ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాల మేరకు నాలుగున్నర లక్షల వ్యయంతో పెనుమాక దేవదాసు వీధిలోని సైడ్ డ్రైన్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులలో నాణ్యత, ప్రమాణాలు పాటించి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుజనా ఆదేశించారన్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారని తెలిపారు.కార్యక్రమంలో ఏ ఈ ప్రసాద్, కూటమి నేతలు బడుగు వెంకన్న, కొమర కిరణ్, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతం
–3వ డివిజన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి …