Breaking News

దీపం-2 పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలెండర్ల బుకింగ్​కు భారీ స్పందన.. అదే స్థాయిలో డెలివరీ చేస్తున్న కూటమి ప్రభుత్వం

-04.11.2024 తేదీ వరకు మొత్తం 16,82,646 సిలిండర్లు బుకింగ్
-నేటి వరకు మొత్తంగా 6,46,350 సిలిండర్లు డెలివరీ చేసిన ప్రభుత్వం
-మొత్తం లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లు నిమిత్తం రూ.38.07 కోట్ల సబ్సిడీ
-ఇప్పటివరకు రూ.16.97 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దీపం-2 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తోంది. దీపావళి కానుకగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టగా.. ఇప్పటివరకు (04.11.2024 తేదీ వరకు) మొత్తం 16,82,646 సిలిండర్లు బుకింగ్ చేసుకోగా నేటి వరకు 04.11.2024 తేదీ వరకు) 6,46,350 సిలిండర్లు డెలివరీ చేయడం జరిగింది. ఇప్పటివరకు సిలిండర్స్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు రూ.38.07 కోట్ల సబ్సిడీ అందించాల్సి ఉండగా.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.16.97 కోట్ల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. 04.11.2024 తేదీన ఒక్కరోజే దీపం-2 పథకం కింద 64,980 గ్యాస్ సిలిండర్లు బుక్ కాగా.. 17,313 సిలిండర్లు డెలివరీ చేశారు. 03.11.2024 తేదీన ఒక్కరోజే 6,29,037 సిలిండర్లు డెలివరీ చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల నిమిత్తం ఏర్పాటు చేసిన 1967 టోల్ ఫ్రీ నంబర్ కు ఇప్పటివరకు 3660 కాల్స్ రాగా వాటికి పరిష్కారం చూపడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *