Breaking News

Tag Archives: vijayawada

మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా అదనపు కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ భారతీయ తత్వవేత్త, కవి, లింగాయత సామాజిక సంస్కర్త అని, ఆయన శివుడిని కేంద్రంగా చేసుకున్న భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని, కళ్యాణి చాళుక్యులు మరియు కలచూరి వంశాల పాలన …

Read More »

ప్రజా సమస్యలపై సిపిఐ దశలవారీ పోరాటం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఈ రోజు విజయవాడ దాసరి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శులు కె.రామకష్ణ, పల్లా వెంకటరెడ్డిలు మాట్లాడుతూ మహిళాబిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలనే కుట్రకు మోడీ, అమిత్‌షా తెరలేపారన్నారు. మోడీ సర్కార్ కుయుక్తులను పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా తిప్పికొట్టడం అభినందనీయమని అన్నారు. 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లును అమలు చేయకుండా, మరోసారి మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో …

Read More »

చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతపై రూపొందించిన డాక్యుమెంటరీని, ఆయన జీవిత విశేషాలతో కూడిన ‘ధర్మచక్రం’ సినిమాను చంద్రన్న జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రదర్శిస్తున్నట్లు దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా వేడుకల వివరాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా అందిస్తున్న సేవలను, ఆయన పాలనలోని విశిష్టతలను ప్రజలకు …

Read More »

ఏపీ బహుజన ఉద్యోగ సంఘం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బహుజన ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘం’ ఏర్పడిందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.దినకర మూర్తి, ప్రధాన కార్యదర్శి లేళ్ల అంజయ్య వెల్లడించారు. ఏపీ బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ 2011 నుంచి బహుజన విద్యుత్ ఉద్యోగుల సంఘంగా కొనసాగుతున్న ఈ సంస్థ, ఇప్పుడు మరిన్ని విభాగాలను కలుపుకొని రాష్ట్ర స్థాయి సంఘంగా విస్తరించిందన్నారు. బహుజన ఉద్యోగుల …

Read More »

రెండో విడత హజ్ యాత్రికుల ప్రయాణానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఫరూక్

-హజ్ యాత్రికులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలి -చివరి విడతగా 177 మంది యాత్రికులు పవిత్ర యాత్రకు వెళ్ళారు -రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూక్ ఫరూక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికుల రెండో విడత ప్రయాణాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూక్ ఫరూక్ ఆదివారం గన్నవరం లో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాత్రికులకు శుభాకాంక్షలు …

Read More »

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ లో వాస్క్యూలర్ వైద్య సేవలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాధరపురం గుప్తా సెంటర్ షాదీ ఖానా సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపు రెండో రోజు కూడా కొనసాగింది… ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఉచిత మొబైల్ మెడికల్ క్లినిక్ కు విశేష సంఖ్యలో స్థానికులు వచ్చారు.. ఈ క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపు లో అమ్మ హాస్పటల్ వాస్క్యూలర్ సర్జన్ శశిధర్ …

Read More »

క‌ళ‌కు కీర్తి.. కొండ‌ప‌ల్లి బొమ్మ‌కు కొత్త ఊపిరి

– కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల క‌ళ‌కు వ‌న్నె తెచ్చేలా ఉత్స‌వాలు – క‌ళాకారుల సంక్షేమానికి స‌మ‌ష్టిగా పెద్ద‌పీట‌ – ఏటా అంబ‌రాన్ని తాకేలా మూడు రోజుల పాటు ఉత్స‌వాలు – కొండ‌ప‌ల్లి ఖిల్లా అభివృద్ధికీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కృషి – విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) – 250 మంది కళాకారుల ప్రదర్శనతో ఆకట్టుకున్న కొండపల్లి కార్నివాల్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 400 సంవ‌త్స‌రాల ఘ‌న చ‌రిత్ర క‌లిగిన కొండ‌ప‌ల్లి బొమ్మ క‌ళ‌కు కీర్తి.. క‌ళాకారుల‌కు కొత్త ఊపిరినిచ్చేలా కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల …

Read More »

ఈ నెల 20న పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీక‌ర‌ణ‌

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీక‌రించనున్న‌ట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపడుతునున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు …

Read More »

విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో KDCC బ్యాంక్ చలివేంద్రం ప్రారంభం

– కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC) చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘు రామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC Bank) ఆధ్వర్యంలో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం బ్యాంక్ ధ్యేయమని తెలిపారు. …

Read More »

విద్యాధరపురంలో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాధరపురం లో నిర్వహించిన సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన వచ్చింది… పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 38, 39 డివిజన్ల ప్రజల కోసం స్థానిక గుప్తాసెంటర్ లోని షాదీఖానా వద్ద సుజనా మొబైల్ క్లినిక ల ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో స్తానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స …

Read More »